Thursday, May 15, 2025

రాంగ్‌ రూట్‌లో బెల్లంబాబు

రాంగ్ రూట్ లో కారు నడుపుతూ వస్తున్న ఓ యువకుడికి కానిస్టేబుల్ షాక్ ఇచ్చాడు. ఇది కరెక్ట్ కాదంటూ వారించడంతో కారును వెనక్కి తిప్పుకొని వెళ్లిపోయాడు. అయితే ఆ కారు నడుపుతున్న వ్యక్తి టాలీవుడ్ యంగ్ హీరో. ఈ తతంగం అంతా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. రూల్స్ విషయంలో పబ్లిక్ అయినా, సెలబ్రిటీలు అయినా అందరూ సమానమే అని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ రాంగ్ రూట్లో కారు నడుపుతూ అడ్డంగా బుక్ అయిన హీరో ఎవరా అనుకుంటున్నారా.. మన బెల్లం బాబే. తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో “బెల్లంకొండ సాయి శ్రీనివాస్” కూడా ఒకరు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకుగా.. సాయి శ్రీనివాస్ సినీ బ్యాగ్రౌండ్ ఉన్నటు వంటి కుటుంబం నుంచి వచ్చినప్పటికీ.. తనదైన శైలిలో విభిన్న పాత్రలు చేస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో హీరోగా వెండితెర ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్.. ఆ తర్వాత స్పీడున్నోడు, జయ జానకి నాయక, రాక్షసుడు, సీత, అల్లుడు అదుర్స్‌ వంటి చిత్రాల్లో నటించాడు. రీసెంట్ గానే ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసి బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా భారీ డిజాస్టర్ గా నిలవడంతో.. కొంచెం గ్యాప్ తీసుకొని “భైరవం” అనే మూవీతో ప్రేక్షకుల ముందు రాబోతున్నాడు. ఇక ఇదిలా ఉంటే… మరోవైపు ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ తీరుపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com