Sunday, March 9, 2025

భాగ్యనగరం బెస్ట్‌ హలీమ్‌ హైదరాబాద్‌లో ట్రెడీషనల్ హలీమ్ స్పాట్స్ ఇవే

రంజాన్ వచ్చిందంటే చాలు దాదాపు నాన్​వెజ్ లవర్స్ అందరూ హలీమ్ గురించి ఎదురు చూస్తూ ఉంటారు. మీరు హైదరాబాద్​లో హలీమ్ తినాలనుకుంటే ఈ ప్లేస్​లలో కచ్చితంగా ట్రై చేయండి. రంజాన్ అనేది ముస్లీం సోదరుల పండుగే అయినా.. హైదరాబాదీలంతా ఎలాంటి బేధం లేకుండా ఎదురు చూసేది మాత్రం హలీమ్ కోసమే. అందరూ కోరుకున్నట్టే ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులో ఉంటుంది. రంజాన్ మాసంలో హైదరాబాద్​లోని దాదాపు ప్రతి వీధిలో హలీమ్ పాయింట్స్ కనిపిస్తాయి. స్ట్రీట్ సైడ్​ వెండర్స్​ నుంచి రెస్టారెంట్లు కూడా ఈ టెస్టీ, మంచి అరోమాతో కూడిన హలీమ్​ను సర్వ్ చేస్తాయి. అయితే ఈ టేస్టీ వంటకాన్ని మీరు ట్రై చేయాలనుకున్నా.. ఫ్రెండ్స్​తో కలిసి ఎంజాయ్ చేస్తూ తినాలన్నా బెస్ట్ పాయింట్​ కోసం ఎదురు చూస్తున్నారా?. హైదరాబాద్​లో మీరు టేస్టీగా హలీమ్​ని తినాలనుకుంటే కొన్ని ప్రదేశాలను కచ్చితంగా ట్రై చేయాలి. ఆ ప్లేస్​లు ఏంటి? ఆ ప్రాంతాల్లోనే హలీమ్ ఎందుకు బెస్ట్.. ఏ లొకేషన్​కి వెళ్తే వాటిని తినొచ్చు.. హలీమ్ స్పాట్​ని ఏరియాతో సహా ఇక్కడ చూసేయండి. ఈ వీకెండ్​కి సోలోగా లేదా ఫ్రెండ్స్​తో కలిసి హైదరాబాద్​లోని బెస్ట్ హలీమ్ స్పాట్స్​ని ఎక్స్​ప్లోర్ చేసేయండి.

పిస్తా హోస్ (Pista House)
హైదరాబాద్​లో బెస్ట్ హలీమ్ స్పాట్ గురించి మాట్లాడుకుంటే కచ్చితంగా ఆ లిస్ట్​లో పిస్తా హోస్ ఉంటుంది. ప్రతి ఏడాదిలానే ఈ ఏడాది కూడా పిస్తా హోస్ కస్టమర్లకు టేస్టీ, జ్యూసీగా ఉండే హలీమ్​ని అందిస్తూ తన మార్క్​ని చూపిస్తుంది. హైదరాబాద్​ అంతటా దీనిని పిస్తా హోస్ విస్తరించి ఉంది. కాబట్టి మీరు కూడా ఈ వీకెండ్ మీకు దగ్గర్లో ఉన్న పిస్తా హోస్​లో ఈ హలీమ్​ని ట్రై చేయవచ్చు.

షాదాబ్ హోటల్ (Shadab Hotel)
ఓల్డ్ సిటీలోని షాదాబ్ హోటల్​ హైదరాబాద్​లో బెస్ట్​ హలీమ్​ స్పాట్​లలో ఒకటి. ఘాన్సీ బజార్​లోని ఈ హోటల్ అధిక నాణ్యతతో కూడిన పదార్థాలను ట్రెడీషనల్​గా కుక్ చేస్తూ.. మంచి రుచిని అందిస్తూ బెస్ట్ హలీమ్ స్పాట్​గా నిలిచింది.

హోటల్ సిటీ డైమండ్ (Hotel City Diamond)
ఎన్నో సంవత్సరాలుగా హోటల్ సిటీ డైమండ్​కి భోజన ప్రియులకు సేవలు అందిస్తుంది. ఇక్కడ హలీమ్​ కూడా మంచి రుచితో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మెహదీపట్నంలో ఉన్న ఈ హోటల్​లో చిక్కనీ, క్రీమిగా ఉండే హలీమ్​ మీకు దొరుకుతుంది. స్వచ్ఛమైన నెయ్యిని, మసాలాలను దీనికోసం వాడుతారు. అంతేకాదు సాంప్రదాయమైన పద్ధతిలో భట్టిని ఉపయోగించి హలీమ్​ను నెమ్మదిగా వండుతారు. అందుకే దీనికి ఇంత రుచి ఉంటుందని చెప్తారు.

మందార్ రెస్టారెంట్ (Mandar Restaurant)
టోలీచౌక్​లోని మందార్ రెస్టారెంట్​ హలీమ్​ని ఇష్టపడేవారికి బెస్టెస్ట్ ఆప్షన్​గా చెప్పొచ్చు. ఇక్కడ హలీమ్​ ట్రెడీషనల్​ పద్ధతిలో వండుతారు. ఇంటి రుచి, విలేజ్​ తరహా రుచిని ఇష్టపడేవారు ఈ హలీమ్​ను కచ్చితంగా ట్రై చేయవచ్చు.

పెషావర్ (Peshawar)
ఎలాంటి టాపింగ్స్ లేకుండా కేవలం హలీమ్​ను ఇష్టపడేవారికి పెషావర్ బెస్ట్ ఆప్షన్. లక్టీకాపుల్​, మలక్​పేటలలో ఈ రెస్టారెంట్​ అందుబాటులో ఉంటుంది. ఎన్నో సంవత్సరాలుగా మంచి రుచికరమైన హలీమ్​ను అందిస్తూ పెషావర్ హలీమ్ ప్రియులను ఆకట్టుకుంటుంది.

సుభాన్ బేకరీ (Subhan Bakery)
ఉస్మానియా బిస్కెట్లకు ప్రసిద్ధి చెందిన సుభాన్ బేకరీ హలీమ్​కి కూడా బాగా ప్రాచుర్యం సంపాదించుకుంది. బిస్కెట్ల మాదిరిగానే హలీమ్​తో కూడా హైదరాబాదీల హృదయాలు గెలుచుకుంది. నాంపల్లి, అత్తాపూర్​లలో సుభాన్ బేకరీ రుచిని ఆస్వాదించవచ్చు.

టాపింగ్స్​తో బెస్ట్ హలీమ్ స్పాట్స్
గ్రిల్ 9 (Grill 9)
బాహుబలి హలీమ్​తో గ్రిల్​ 9 బాగా ఫేమస్ అయింది. ఈ స్పెషల్ హలీమ్​లో భాగంగా 3 ప్లేట్ల హలీమ్​, బాయిల్డ్ ఎగ్స్, చికెన్ 65, పత్తర్​ కా ఘోష్, నల్లి, వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పు, బాదం, క్రీమ్ వేసి దీనిని మీకు సర్వ్ చేస్తారు. టాపింగ్స్​తో హలీమ్​ని ఇష్టపడేవారికి ఇది బెస్ట్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. దీనికోసం మీరు సికింద్రాబాద్ వెళ్లాల్సి ఉంటుంది.

సర్వి రెస్టారెంట్ (Sarvi Restaurant)
సర్వి రెస్టారెంట్​ మీకు బెస్ట్ హలీమ్ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. మసాబ్ ట్యాంక్, బంజారాహిల్స్, మాదాపూర్, సికింద్రాబాద్​లలో దీని బ్రాంచ్​లు ఉన్నాయి. చికెన్ 66, ఉడికించిన గుడ్డు, జీడిపప్పు, క్రీమ్​తో నిండిన స్పెషల్ ఇరానీ హలీమ్​ని మీరు ఈ రెస్టారెంట్​లో తినొచ్చు.

కేఫ్ 555 (Cafe 555)
మసాబ్ ట్యాంక్​లోని కేఫ్ 555 ఫ్యూజన్ హలీమ్​కు ఫేమస్. ఇక్కడ చికెన్ 65, నల్లి ఘోష్, తలావా ఘోష్, ఎగ్, క్రీమ్ వంటి టాపింగ్స్​తో హలీమ్​ను ఆస్వాదించవచ్చు. ఇది హలీమ్​ రుచిని నెక్స్ట్​ లెవెల్​కి తీసుకెళ్తుంది.

షా ఘౌస్ (Shah Ghouse)
మీరు హైదరాబాద్​లో ఉంటే షా ఘౌస్​ హలీమ్​ని కచ్చితంగా ట్రై చేయవచ్చు. నోరూరించే మాంసపు రుచితో, రుచికి తగ్గట్లు, రుచిని మరింత పెంచే టాపింగ్స్​నిస్తూ హలీమ్ ప్రియులను ఆకట్టుకుంటుంది షా ఘౌస్. లక్టీకాపుల్, టోలిచౌకి, గచ్చిబౌలి, షా అలీ బండా బ్రాంచ్​లలో దీనిని ట్రై చేయవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం.. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ఈ వీకెండ్ సమయంలో హైదరాబాద్లోనే బెస్ట్ హలీమ్ రుచులను ఆస్వాదించేయండి.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com