ఉద్యోగం రాదనే బెంగతో బీటెక్ చదివిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో ఆదివారం జరిగింది. మండల కేంద్రానికి చెందిన గుడికాడి సంపత్ (23) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. వివిధ కంపెనీలలో ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఉద్యోగం రాదనే బెంగ సంపత్‌ను వెంటాడింది. ఉద్యోగ ప్రయత్నాల్లో తాను ఓడిపోతున్నానని తల్లిదండ్రులతో చెప్పుకొని బాధ పడేవాడు. కుటుంబ సభ్యులు ఆదివారం ఓ శుభకార్యానికి వెళ్లగా సంపత్ తమ పొలం వద్ద ఉన్న షెడ్డులో ఉరివేసుకున్నాడు.