Friday, April 4, 2025

ఫేక్ పోలీసుల ఫోన్ కాల్స్‌తో జాగ్రత్త

ప్రజలను హెచ్చరించిన ఆర్టీసి ఎండి సజ్జనార్

డ్రగ్ పార్శిళ్ల పేరుతో నకిలీ ఫోన్‌కాల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వారిపట్ల జాగ్రత్త ఉండాలంటూ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల మాదిరిగా బిల్డప్ ఇస్తూ తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని సజ్జనార్ హెచ్చరించారు. తాము ముంబై క్రైం బ్రాంచీ నుంచి మాట్లాడుతున్నాం, మీ పేరుతో ఫెడెక్స్‌లో ఒక పార్శిల్ బుక్ అయ్యింది. అందులో నకిలీ పాస్‌పోర్టులు, డ్రగ్స్ ఉన్నాయి.

ALSO READ: బిఆర్‌ఎస్,- బిజెపిల మధ్య ఉన్న రహస్య ఒప్పందం బయటపడింది

అంతేకాదు, మీకు ఉగ్రవాద మాస్టర్ మైండ్ అయిన మహ్మద్‌తో పాటు పలు బ్యాంకుల్లో జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. మీరు తీవ్రమైన కేసులో ఇరుక్కున్నారు. అంటూ నకిలీ పోలీసుల పేరుతో సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్స్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. పార్శిళ్లలో డ్రగ్స్, తీవ్రవాదులతో బ్యాంక్ లావాదేవీలు చేశారంటూ భయభ్రాంతులకు గురిచేస్తూ కోట్లలో కుచ్చుటోపీ పెడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా అచ్చం పోలీసుల్లాగా బిల్డప్ ఇస్తూ.. తమ ఐడీ కార్డులను, ఎఫ్‌ఐఆర్ కాపీలను పంపిస్తూ మోసాలకు తెగబడుతున్నారని ప్రజలు ఇలాంటి ఫోన్‌కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com