Monday, March 31, 2025

FedEx courier scams: ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి

ఫెడెక్స్ పార్శిల్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దు

సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారిలో తెలంగాణ ముందంజలో ఉంది. సైబర్ నేరాలకు సంబంధించి రాష్ట్రంలో 15 వేల 297 కేసులు నమోదై దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ప్రస్తుతం సైబర్ నేరగాళ్లు ఇప్పుడు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి దోచుకుంటున్నారు. ఈ తరహా మోసాలపై ఆర్టీసి ఎండి సజ్జనార్ కీలక ప్రకటన చేశారు. ఫెడెక్స్ కొరియర్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కేటుగాళ్లు ఫెడెక్స్ కొరియర్ కంపెనీ నుంచి కాల్ చేస్తారు.

ఆ తర్వాత మీ ఆధార్ నంబర్‌తో కూడిన పార్శిల్ వచ్చిందని, అందులో స్మగ్లింగ్ డ్రగ్స్ పట్టుబడ్డాయని భయాందోళనకు గురిచేస్తారు. డ్రగ్స్ అక్రమ రవాణా కేసుల్లో శిక్షలు కఠినంగా ఉంటాయని చెప్పి కేసుల నుంచి తప్పించుకునేందుకు లక్షల్లో డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆర్టీసి ఎండి సజ్జనార్ పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండి, అలాంటి వారిని ధైర్యంగా ఎదుర్కొనాలని ఆయన సూచించారు. ఫెడెక్స్ పార్శిల్స్ పేరుతో వచ్చే మోసపూరిత కాల్స్‌ను నమ్మవద్దని, పోలీసులమని చెబితే డబ్బులు ఇవ్వొద్దని ఆయన తెలిపారు. ఏవైనా సందేహాలుంటే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మీకు కూడా అలాంటి కాల్స్ వస్తే భయపడకుండా స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com