- వరల్డ్ రికార్డుతో దుమ్మురేపిన భద్రాచలం క్రికెటర్ ‘గొంగడి త్రిష’
- భద్రాచలంలో సంబరాలు
భద్రాచలం పట్టణానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి గొంగడి త్రిష తన సత్తా చాటింది. భద్రాచలం పేరును ఉన్నత స్థాయిలో నిలబెట్టింది. టి20 మహిళా ప్రపంచ్ కప్‌లో త్రిష వరల్డ్ రికార్డు సాధించింది. స్కాట్లాండ్‌లో జరిగిన అండర్ 19 టి20 మ్యాచ్‌లో తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సాధించింది. 50 బంతుల్లో 110 పరుగులు చేసి సెంచరీ సాధించింది. అండర్19 వరల్డ్ కప్‌లో భాగంగా మంగళవారం స్కాట్లాండ్‌లో టీమ్ ఇండియా తరుపున త్రిష పోటీ పడింది.
తక్కువ బంతుల్లోనే సెంచరీ సాధించి భద్రాచలం పేరును దేశవ్యాప్తంగా తెలియపరిచింది. వీటిలో 13 ఫోర్‌లు, 4 సిక్స్‌లు కొట్టి సెంచరీ పూర్తి చేసింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న టీమ్ ఇండియా 20 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 208 పరుగులు సాధించారు. ఇందులో భద్రాచలానికి చెందిన గొంగడి త్రిష 110 పరుగులు చేసింది. త్రిష విజయం పట్ల భద్రాచలం పట్టణంలో సంబరాలు జరుపుకుంటున్నారు. పట్టణంలో బైక్ ర్యాలీతో త్రిషకు ప్రశంసల జల్లు కురిపించారు.