రాష్ట్రంలో భద్రాచలం ప్రభుత్వ ప్రాంతీయ వైద్యశాలలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళకు ఏకంగా 5.25 కిలోలు బరువున్న పండంటి మగశిశువు జన్మించాడు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బూర్గంపాడు మండలం ఇరవెండి గ్రామానికి చెందిన మడకం నందిని కాన్పు కోసం ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి వెళ్లగా వైద్యులు ఆపరేషన్ చేసి తల్లీబిడ్డలను కాపాడారు. సాధారణంగా అప్పుడే పుట్టిన పిల్లలు రెండున్నర కిలోల నుంచి సుమారు మూడున్నర కిలోల బరువు ఉంటారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.రామకృష్ణ తెలిపారు. కానీ ఈ బిడ్డ 5.25 కిలోలు ఉందని, ఇది ఒక అరుదైన ఘటన అని ఆయన పేర్కొన్నారు. 5.25 కిలోలు బరువున్న మగశిశువుకు జన్మించిన నందినికి ఇది మూడో కాన్పు కాగా ముగ్గురు మగ సంతానమే.