భద్రాచలంలో ఘోర ప్రమాదం సంభవించింది. నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు వదిలారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు స్పందించి.. శిథిలాల కింద చిక్కుకుపోయిన కార్మికులను వెంటనే వెలికి తీసి.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకా ఎవరైనా కార్మికులు చిక్కుకున్నారా అన్నది పరిశీలిస్తున్నారు. అయితే.. ప్రమాదానికి కారణం తెలియాల్సి ఉంది. మరణించిన కార్మికులు వివరాలు కూడా తెలియాల్సి ఉంది.