Saturday, November 30, 2024

భగ..భగమంటున్న బంగారం ధరలు

ప్రస్తుతం బంగారం అంటే 24 క్యారెట్లు అంటారు. స్వచ్ఛమైన బంగారం లేదా 24 క్యారెట్ బంగారం 99.9 శాతం స్వచ్ఛతను సూచిస్తుంది. అలాగే దానిలో ఏ ఇతర లోహాన్ని కలపరు. కేవలం కడ్డీలు, నాణాలు తయారు చేయడానికి మాత్రమే ఈ 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగిస్తారు.బంగారం ధరలు తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పరుగులు పెడుతున్నాయి. గత నాలుదైదు రోజులుగా తగ్గుముఖం పడుతున్న పసిడి ధరలు.. మళ్లీ ఎగబాకుతున్నాయి. ఒక రోజు తగ్గితే మరో రోజు పెరుగుతున్నాయి. ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులు మహిళలతో కిటకిటలాడుతుంటాయి. పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యక్రమాలలో కొనుగోలుదారులతో షాపులు బిజీగా ఉంటాయి. తాజాగా నవంబర్‌ 30న దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా పరిశీలిస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,610 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.78,120 ఉంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే.

22 క్యారెట్ల బంగారం
ఆభరణాల తయారీకి 22 క్యారెట్ల బంగారం మంచిది. ఇది 22 భాగాలు బంగారం, రెండు భాగాలు వెండి, నికెల్ లేదా ఏదైనా ఇతర లోహం. ఇతర లోహాలను కలపడం ద్వారా బంగారం గట్టిపడుతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular