Monday, May 19, 2025

భారత్ మీద అణ్వస్త్ర క్షిపణి ప్రయోగించిన పాక్ ఎస్400తో అడ్డుకున్న ఆర్మీ

భారత్ మీద అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన షాహిన్ క్షిపణి పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే పాక్ ప్రయోగించిన క్షిపణిని సైన్యం ఎస్400తో విజయవంతంగా పేల్చేసింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని 9 ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు ధ్వంసం చేశాయి. అయితే అందుకు ప్రతీకార చర్యలు చేపట్టిన పాకిస్తాన్ డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులు చేసింది ఫైటర్ జెట్లతో సైతం సరిహద్దుల్లో దాడులకు పాల్పడగా భారత్ వారి ప్రయత్నాలు తిప్పికొట్టి బుద్ధి చెప్పింది. భారతదేశంపై దాడుల సమయంలో పాక్ ఓ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి షాహిన్ ను ప్రయోగించింది. అయితే పాక్ ప్రయోగించిన అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణిని భారతదేశానికి సుదర్శన చక్రంగా మారిన S-400 విజయవంతగా అడ్డుకుంది. ఈ విషయాన్ని మన సైన్యం వెల్లడించింది. పాక్ అణ్వస్త్ర క్షిపణిని గాల్లోనే విజయవంతంగా నియంత్రించడంతో ఎటువంటి నష్టం జరగలేదని భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ తెలిపింది. భారత ఆర్మీ, డీజీఎంఓ ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వీడియోలను గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాయి.
పాకిస్తాన్ ప్రయోగించిన షాహీన్ మిస్సైల్ భూ ఉపరితలం నుంచి ప్రయోగించగల మీడియం రేంజ్ ఖండాంతర క్షిపణి. పాక్ దీనిని మార్చి 2015లో మొదటిసారి పరీక్షించింది. షాహిన్ మిస్సైల్ అణ్వాయుధాలతో పాటు యుద్ధ ట్యాంకులు, ఇతర సాంప్రదాయ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఈసారి పాక్ ఆర్మీ యుద్ధట్యాంకులతో ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్షిపణిని ప్రయోగించింది. రష్యా రూపొందించిన భారత అమ్ములపొదిలో పవర్ ఫుల్‌గా ఉన్న S-400 క్షిపణితో ఆ బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది.
S-400లో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్ ఉంటాయి. ఇది ఫైటర్ జెట్లతో పాటు, క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను సైతం ఢీకొట్టగలదు. పాక్ ప్రయోగించిన షాహిన్ వంటి వేగంగా కదిలే బాలిస్టిక్ క్షిపణులను కూడా నాశనం చేయగలదు. దీని సామర్థ్యం, సుదూర లక్ష్యాలను ఛేదించనున్న కారణంగా NATO సభ్య దేశాలు ఎస్400పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాయి. ఆకాష్ సైతం పాక్ డ్రోన్ దాడులను, క్షిపణులను విజయవంతంగా ఎదుర్కొంది.

కాల్పుల విమరణకు పాక్, భారత్ అంగీకారం..
భారత్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలపై దాడులకు పాక్ ప్రయత్నించింది. మే 8, 9 తేదీలలో డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు యత్నించిన పాక్ ఆర్మీకి భాతర త్రివిధ దళాలు బుద్ధి చెప్పాయి. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్, ఫైటర్ జెట్లను భారత్ విజయవంతంగా కూల్చివేసింది. అంతటితో ఆగని భారత బలగాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కరాచీ, లాహోర్, రావల్ఫిండి సహా పలు నగరాల్లోని పాక్ ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై దాడులు చేసి ధ్వంసం చేసింది. దాంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. శాంతి చర్చలు అంటూ కాల్పుల విరమణకు పదే పదే రిక్వెస్ట్ చేయడం, అమెరికా సైతం సైతం యుద్ధం నష్టాన్ని చేకూరుస్తుందని సూచించడంతో మే 10న భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com