- కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరా
- భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని ధ్రువీకరించిన భారత రాయభారి
కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఉన్నతాధికారులు బిష్కెక్లోని భారత రాయబారి అరుణ్‌కుమార్ ఛటర్జీ సంప్రదించి వివరాలు సేకరించారు. భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని, ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబిసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతుండగా భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారు. ఇక్కడ జరిగిన ఘటనలో భారతీయ విద్యార్థి ఎవరూ తీవ్రంగా గాయపడలేదని, ఆసుపత్రిలో చేరలేదని, సోషల్ మీడియా పోస్టులు వాస్తవం కాదని భారత రాయభారి ధృవీకరించారు.