భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టిన తర్వాత పాకిస్థాన్ మన స్థావరాలపై దాడికి విఫలయత్నం చేసింది. కానీ వారి ఆటలు సాగలేదు. పాకిస్థాన్ కుట్రదాడులకు S-400 అడ్డంగా నిలబడింది. ఉగ్రమూకల భరతపట్టిన భారత్‌పై పాకిస్థాన్ రగిలిపోతోంది. అవసరం ఉన్నప్పుడు ఉగ్రకుక్కల్ని ఉసిగొల్పి పబ్బం గడుపుకోవడం పాకిస్థాన్‌కు అలావాటుగా మారింది. ఆ దేశం తమ సైన్యం కంటే ఎక్కువగా ఉగ్రవాదులనే నమ్ముకుంటోంది. అందుకే వారి స్థావరాలను ధ్వంసం చేసిన భారత్‌పై కక్ష పెంచుకుంది. సుందరమైన ప్రదేశాలు చూసేందుకు వెళ్లిన పర్యాటకులపై ఏప్రిల్ 22న కాల్పులు జరిపారు. 26 మంది పొట్టన పెట్టుకున్నారు. దీనికి ప్రతిగానే భారత్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. దీంతో పేట్రేగిపోయిన పాకిస్థాన్ భారత్‌లో విధ్వంసం సృష్టించేందుకు విఫలయత్నం చేస్తోంది. భారత్‌ను దొంగ దెబ్బ తీసేందుకు అర్థరాత్రి వేళ క్షిపణి దాడులకు యత్నించింది. కానీ పాక్ కుట్రలను ముందే తెలుసుకున్న భారత్ ఆర్మీ అన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టింది. ఇలాంటి పన్నాగాలు చేస్తుందన గ్రహించి అన్ని రక్షణ వ్యవస్థలను అలర్టే చేసింది భారత సైన్యం. పాకిస్తాన్ దాడులను తిప్పికొట్టడానికి భారత వైమానిక దళంలోని S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ చాలా అక్కరకు వచ్చింది. మొన్న, నిన్న రాత్రి జరిగిన దాడులను సమర్థంగా ఎదుర్కోగలిగింది. పాకిస్థాన్‌కు భయాన్ని పరిచయం చేసింది.
పాకిస్తాన్‌లోని నాలుగు, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఐదు ఉగ్రవాద శిబిరాలపై భారత సాయుధ దళాలు దాడులు చేసిన సంగతి తెలిసిందే. అందుకే భారతదేశంపై పాకిస్తాన్ సైనిక చర్యకు విఫలయత్నం చేసింది. ఆ దాడులను అడ్డుకోవడానికి భారత్ ఉపయోగించే S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థవంతమైంది. అత్యంత ప్రాణాంతకమైన ఉపరితలం నుంచి గగనతలానికి క్షిపణులు లేదా SAMలలో అడ్డుకునే శక్తి దీనికి ఉంది. S-400 క్షిపణి రక్షణ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన దీర్ఘ-శ్రేణి వాయు రక్షణ వ్యవస్థల్లో ఒకటి. 2014లో S-400 క్షిపణి వ్యవస్థను మొదటి చైనా కొనుగోలు చేసింది. S-400లో మూడు భాగాలు ఉంటాయి. క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్. ఇది విమానం, క్రూయిజ్ క్షిపణులు, వేగంగా కదిలే ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోగలదు. అటాక్ చేయగలదు. S-400 సుదూర శ్రేణి సామర్థ్యాల కారణంగా NATO సభ్యులు దీనిని ఒక పెద్ద ముప్పుగా చెబుతారు. S-400 దాదాపు అన్ని రకాల ఆధునిక యుద్ధ విమానాలను ఎదుర్కొంటుంది. దీని రాడార్ 600 కి.మీ దూరంలో ఉన్న లక్ష్యాలను ట్రాక్ చేస్తుంది. అక్టోబర్ 2018లో భారతదేశం S-400 వైమానిక రక్షణ క్షిపణి వ్యవస్థల ఐదు యూనిట్లు కొనుగోలు రష్యాతో ఒప్పందం చేసుకుంది. దీని ఖరీదు $5 బిలియన్లు.