యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో అగ్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ తో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ రెడ్ జెయింట్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘ భారతీయుడు 2’. వీరిద్దరి కాంబినేషన్‌లో 1996లో విడుదలైన బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేసిన ‘ఇండియన్’ చిత్రాన్ని ‘భారతీయుడు’గా విడుదల చేసింది. ఆ మూవీకి సీక్వెల్‌గా ఇప్పుడు ‘ భారతీయుడు 2’ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. భారతీయుడు సీక్వెల్ అంటే ఎలాంటి అంచనాలుంటాయో వాటిని మించేలా డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2ను విజువల్ వండర్‌గా ఆవిష్కరిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతిగా కమల్ హాసన్ పవర్‌ఫుల్ పెర్ఫామెన్స్ ఇవ్వటానికి రెడీ అయ్యారు. ఈ సినిమా శరవేగంగా రూపొందుతోంది. జూలై సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. లేటెస్ట్‌గా ముంబైలోని స్టార్ స్పోర్ట్స్ ఛానల్ లో ‘భారతీయుడు 2’ ప్రమోషన్స్ ను వినూత్నంగా ప్రారంభించటం విశేషం. అలాగే జూన్ 1న చెన్నైలో ఈ మూవీ ఆడియో వేడుకల ప్రముఖుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించనున్నారు. మన దేశాన్ని అవినీతి క్యాన్సర్‌లా పట్టి పీడిస్తోంది. దీన్ని రూపుమాపటానికి సేనాపతి ఈ సీక్వెల్‌లో ఏం చేశారనేది అందరిలో ఆసక్తిని పెంచుతోంది