Saturday, December 28, 2024

భారత్‌లో కింగ్‌ చార్లెస్‌ దంపతులు వెల్‌నెస్‌ కేంద్రంలో థెరపీ చికిత్సలు

బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ – 3 సీక్రెట్‌గా భారత్‌ పర్యటకు వచ్చినట్లు తెలిసింది. సతీమణి క్వీన్‌ కెమిల్లా తో కలిసి మూడు రోజుల పర్యటన నిమిత్తం బెంగళూరుకు వచ్చినట్లు సమాచారం. అక్టోబర్‌ 27 నుంచి వారు బెంగళూరులోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో బస చేస్తున్నట్లు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
కింగ్‌ చార్లెస్‌ దంపతులు ఈ నెల 21 నుంచి 26 మధ్య కామన్వెల్త్‌ ప్రభుత్వాధినేతల సమావేశానికి హాజరైన తర్వాత సమోవా నుంచి నేరుగా భారత్‌కు సీక్రెట్‌గా వచ్చినట్లు సదరు కథనాలు తెలిపాయి. వారు బెంగళూరులోని ఓ వెల్‌నెస్‌ సెంటర్‌లో బస చేస్తున్నట్లు పేర్కొంది. ఈ సెంటర్‌లో యోగా, ధ్యానం వంటి సెషన్స్‌తో సమయం గడుపుతున్నట్లు తెలిసింది. వెల్‌నెస్‌ సెంటర్‌ సిబ్బంది కింగ్‌ చార్లెస్‌, కెమిల్లాకు వివిధ రకాల థెరపీ చికిత్సలు నిర్వహిస్తున్నట్లు సదరు కథనాలు వెల్లడించాయి. ఈ సీక్రెట్‌ ట్రిప్‌ ముగించుకొని ఇవాళ వీరు బ్రిటన్‌ బయల్దేరనున్నట్లు తెలిసింది. వీరు బస చేస్తున్న వెల్‌నెస్‌ సెంటర్‌.. యోగా, ధ్యాన సెషన్‌లు, థెరపీ చికిత్సలకు ప్రసిద్ధి చెందినదిగా ఓ అధికారిని ఊటంకిస్తూ సదరు కథనాలు నివేదించాయి.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com