Thursday, January 23, 2025

భార్యను కుక్కర్‌లో వేసి ఉడికించిన భర్త

హైదరాబాద్‌లో దారుణం జరిగింది. భార్యను హత్య చేసి ఆ మృతదేహాన్ని ముక్కలు చేసి కుక్కర్‌లో వేసి ఉడికించాడు భర్త. మిగిలిన ఆ అవశేషాలను చెరువులో పడవేశాడు ఓ రాక్షసుడు. ఆ తర్వాత తనకేమీ తెలియదన్నట్లు భార్య వెంకట మాధవి కనిపించడం లేదని అత్త సుబ్బమ్మతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ దారుణ ఘటన రంగారెడ్డి జిల్లా మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళితే.. జిల్లెలగూడ న్యూ వెంకటరమణ కాలనీలో నివాసం ఉండే గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం వెంకట మాధవితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. గురుమూర్తి గతంలో ఆర్మీలో పని చేసి రిటైరయ్యాడు. ప్రస్తుతం కంచన్‌బాగ్‌లో సెక్యూరిటీ గార్డ్‌గా పని చేస్తున్నాడు. అయితే గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ నెల 16న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ అత్త సుబ్బమ్మతో కలిసి గురుమూర్తి మీర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తమదైన శైలిలో పోలీసులు విచారణ చేయగా, షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. తానే భార్యను హత్య చేశానని గురుమూర్తి ఒప్పుకున్నాడు. తన భార్య మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్‌లో ఉడికించి ఆ తర్వాత వాటిని జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు పోలీసులకు తెలిపాడు. గురుమూర్తి తెలిపిన విషయాలపై ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహం అవశేషాల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com