Wednesday, May 14, 2025

భట్టి విక్రమార్కకు ఖమ్మం టికెట్ విషయంలో కుట్రలు

రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత భట్టికి లేదు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు ఆగ్రహం రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత భట్టి విక్రమార్కకు లేదని విహెచ్ సీరియస్ అయ్యారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించానని, కానీ, ఇలా నా విషయంలో కుట్ర చేస్తారని అనుకోలేదని ఆయన ఆవేదన చెందారు. బిజెపి అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపి వి.హనుమంత రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం విహెచ్ మీడియాతో మాట్లాడుతూ తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని దీక్షకు దిగినట్టు ఆయన తెలిపారు.

ఖమ్మం టికెట్ రాకుండా తనపై కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ఆయన అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడినందుకు తనపై కక్ష గట్టారని విహెచ్ ఆవేదన చెందారు. ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని విహెచ్ తెలిపారు. తనకు టికెట్ రాకుండా కుట్రలు చేయడమే కాదు, ఖమ్మం టికెట్‌ను బయటివారికి ఇవ్వడానికి సిద్ధమయ్యారని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి స్పందించాలని విహెచ్ కోరారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైంలో ఫిర్యాదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com