సోషల్ మీడియా పోస్టులు తొలిగింపు
కంచ గచ్చిబౌలి భూముల వివాదం గురించి అందరికి తెలిసిందే.. తెలుగు రాష్ట్రాల్లో ఇది హాట్ టాపిక్ అవుతుంది. రోజు రోజుకో వార్త తెరపైకి వస్తుంది. తాజాగా ఫేక్ వీడియోలు, ఇమేజ్ ల గురించి సోషల్ మీడియాలో వార్తలు చర్చనీయాంశంగా మారాయి. భూముల విషయంలో ఫేక్ వీడియోలను, ఏఐ వీడియోలను, ఫోటోలను విస్తృతంగా ఉపయోగించి చేయాల్సినంత డ్యామేజ్ చేశారని చాలా మందిపై రేవంత్ ప్రభుత్వానికి కోపం ఉంది.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకొనే పనిలో తెలంగాణ సర్కార్ ఉంది. అయితే ఫేక్ ఫోటోలను సెలెబ్రేటీలు కూడా పోస్ట్ చేసినట్లు తెలుస్తుంది. అయితే అవి ఫేక్ అని తెలుసుకొని తమ పోస్టులను తొలగిస్తున్నారు. ఫేక్ వీడియోలను సర్క్యులేట్ చేసిన వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అయితే విమర్శలు రాకుండా ఉండేందుకు నేరుగా హైకోర్టు నుంచే ఆదేశాలు తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.. ఇప్పటికే పలువురి పై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇప్పుడు సెలెబ్రేటిల పై కఠిన చర్యలు తీసుకొనేలా తెలంగాణ సర్కార్ ముందుకు సాగుతుంది.
ఫేక్ ఇమేజ్ లతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న ప్రముఖులు
కంచ గచ్చిబౌలి విషయంలో వన్య ప్రాణులు చెల్లా చెదురు అవుతున్నట్లుగా ఫేక్ వీడియోలు.. ఏఐ వీడియోలు క్రియేట్ చేశారని.. తప్పుడు ప్రచారం చేసి సమాజంలో శాంతిభద్రతల సమస్యను తీసుకొచ్చిన వారిపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. అలాంటి వీడియోలు, ఇమేజ్ లను పోస్ట్ చేసిన వారిని వదిలేది లేదని అధికారులకు ఆదేశిస్తున్నారు. ముందస్తుగా తెలంగాణ పోలీసులు హైకోర్టు లో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణను హైకోర్టు 24వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజున వాదనలు వింటామని చెప్పింది. ఇలాంటి వీడియోలను వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటే మాత్రం ఎవ్వరిని వదలకుండా కేసులు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
పోస్టులను తొలగించిన సెలెబ్రేటీలు
నెమళ్లు ఆర్తనాదాలు చేస్తున్నట్లుగా..జింకలు అరుపులుతో పారిపోతున్నట్లుగా ఆడియోలను వైరల్ చేశారు.. అయితే అవి కేవలం కల్పితాలే కావడంతో పోస్టులు షేర్ చేసిన సెలెబ్రేటీలు ఒక్కొక్కరు వాటిని తొలగించే పనిలో ఉన్నారని తెలుస్తుంది. ఆ సెలెబ్రేటిలలో స్టార్ హీరోయిన్లు ఉన్నారని తెలుస్తుంది. వాళ్లు తమ అకౌంట్ నుంచి పోస్టులను తొలగించేస్తున్నారు. ఇప్పటివరకు సమంత, రష్మికమందన్న, రేణుదేశాయ్ వంటి వాళ్లు తమ అకౌంట్ నుంచి పోస్టులను తొలగించేశారు. అయితే వీరంతా వాడిన పిక్స్ ఎఐ క్రియేట్ చేసినవే.. ఏది ఏమైనా కూడా ఇలాంటి తప్పుడు వీడియోల వల్ల తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంత మంది పోస్టులు పెట్టారని.. తమ ప్రభుత్వ ప్రతిష్టకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని ప్రభుత్వం భావిస్తున్నందున అలాంటి వారిని ఉపేక్షించకూడదని భావిస్తుంది. గతంలో అయితే వరుసగా అరెస్టులు చేసేవారు. కోర్టుల్లో వారికి రిలీఫ్ లభించేది.. ఇప్పుడు ఏకంగా కోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని మరి పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఒకవేళ కోర్టు పోలీసులకు చర్యలు తీసుకోమని ఆదేశిస్తే మాత్రం సెలబ్రిటీలకు కూడా శిక్షలు తప్పేలా లేవు.. మరి ఇందులో ఎవరెవరిపై కేసులు నమోదు అవుతాయో త్వరలోనే తెలిసే అవకాశాలు ఉన్నాయి.