Saturday, May 10, 2025

సిఎం రేవంత్‌రెడ్డిని కలిసిన నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్

ఎయిర్‌గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసా సోమవారం సచివాలయంలో మంత్రి కొండా సురేఖతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.

రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వారిని సిఎం అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సిఎం వారిని ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలను అందిస్తుందని వారికి సిఎం భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం యువత క్రీడాకారులుగా ఎదిగే దిశగా ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కృషి చేస్తుందని సిఎం తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com