Monday, March 10, 2025

బేబి బంప్‌తో మనోజ్‌ భార్య

దివంగత భూమా నాగిరెడ్డి ద్వితీయ కుమార్తె మౌనిక గత ఏడాది పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. సినీ హీరో.. మోహన్‌బాబు ద్వితీయ కుమారుడు మంచు మనోజ్‌ను వివాహ బంధంతో ఒకట్టయ్యారు. మౌనిక ప్రస్తుతం గర్భవతి. తమ కుటుంబంలోకి మరో బుజ్జాయి వస్తున్నాడంటూ గత డిసెంబర్ లోనే మౌనిక తన ప్రెగ్నెన్సీ గురించి తెలిపింది. తాజాగా తన బేబీ బంప్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరికీ ఇది రెండో వివాహం కావడం గమనార్హం. తొలి భర్తతో మౌనికకు ధైరవ్ అనే కొడుకు ఉన్నాడు. ధైరవ్ ను కూడా మనోజ్ సొంత కొడుకుగానే చూసుకుంటున్నారు. పెళ్లి తరువాత మనోజ్ స్పందిస్తూ… కలిసొచ్చే కాలానికి ఎదురొచ్చే కొడుకు పుడతాడని అంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. కెరీర్ విషయాల్లోకి వస్తే కొత్త సినిమాతో రీఎంట్రీ ఇచ్చేందుకు మనోజ్ రెడీ అవుతున్నాడు. పిల్లల కోసం ఆట వస్తువులు, బొమ్మలు తయారు చేసి, అమ్మే కంపెనీని మౌనిక ప్రారంభించింది. మరి వీరిద్దరి జీవితాల్లోకి మరో కొత్త బుజ్జాయి రాబోతున్నందుకు ఇద్దరి కుటుంబ సభ్యులు ఆనందంగా ఉన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com