రాష్ట్ర కేబినెట్ భేటీ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ధరణి పోర్టల్ ను భూమాత పోర్టల్ గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ చట్టంలో కొన్ని మార్పులను కూడా తీసుకురానున్నారు. ఇప్పటికే ధరణి సమస్యలపై విజ్ఞప్తులు స్వీకరించారు.
అంతేకాకుండా హుస్నాబాద్ నియోజకవర్గంలోని గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గౌరవెల్లి ప్రాజెక్టు పెండింగ్ పనుల కోసం రూ. 437 కోట్లను విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.