Friday, September 20, 2024

ఈనెల 19వ తేదీన లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘భూన్యాయ శిబిరం’

ఈనెల 19వ తేదీన లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘భూన్యాయ శిబిరం’
లీఫ్స్ సంస్థ మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగర, బొమ్మకల్, జనగాం జిల్లా పాలకుర్తి మండలం బమ్మెర, సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండలం వెంపటి, నాగారం, ఫణిగిరి గ్రామాలను దత్తత తీసుకుంది. ఇక్కడ కూడా సమస్యలను అధ్యయనం చేసి నివేదికను ప్రభుత్వానికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఇందులో భాగంగానే ఈ నెల 19వ తేదీన (గురువారం) మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం చిన్నవంగరలో ‘భూన్యాయ శిబిరం’ భూమి హక్కుల పరీక్షల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు లీఫ్స్ సంస్థ పేర్కొంది. భూ న్యాయ శిభిరానికి లీఫ్స్ అధ్యక్షుడు భూమి సునీల్ కుమార్, వ్యవసాయ సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ఎమ్మెల్సీ ప్రొ.కోదండరాం, సిఎంఆర్వో ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.లచ్చిరెడ్డి, రెవెన్యూ చట్టాల నిపుణులు పాల్గొంటారు. మిగతా బొమ్మకల్, బమ్మెర, వెంపటి, ఫణిగిరి గ్రామాల్లో కూడా త్వరలోనే భూన్యాయ శిబిరాలు నిర్వహించనున్నట్లు లీఫ్స్ సంస్థ తెలిపింది.

భూమి సమస్యలు ఉన్న రైతులకు ఉచితంగా సలహాలు ఇవ్వనున్నారు. భూమికి భూసార పరీక్షలు, మనుషులకు ఆరోగ్య పరీక్షల మాదిరిగానే భూమికి ఏమైనా చిక్కులు ఉన్నాయో లేదో తెలుసుకోవడం కోసం ‘భూహక్కుల పరీక్ష’ను రూపొందిస్తున్నారు. ఇప్పటికే లీఫ్స్ సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలాన్ని దత్తత తీసుకోని పది గ్రామాల్లో భూ న్యాయ శిబిరాలను నిర్వహించడంతో పాటు అక్కడి భూ సమస్యలను గుర్తించి, రెవెన్యూ రికార్డులు పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. యాచారం మండలంలోని పది గ్రామాల్లోని 2,114 మందికి సంబంధించి 4,465 సర్వే సబ్ డివిజన్లకు సంబధించిన భూ సమస్యలు గుర్తించడం విశేషం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular