Sunday, October 6, 2024

బిగ్ భారత్ క్రికెట్ లీగ్ లోగో, పోస్టర్ ఆవిష్కరించిన ఏసీఏ అద్యక్షుడు,ఎం.పి. కేశినేని శివనాథ్

విజయవాడ:Big Bharat Cricket League (BBL) logo and poster  బిగ్ భారత్ క్రికెట్ లీగ్ (బి.బి.ఎల్‌) లోగో అండ్ పొస్టర్ ను ఏసీఏ అద్యక్షుడు, ఎం.పి కేశినేని శివనాథ్ గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో శనివారం ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ప‌లు సెక్టార్ల నుంచి ఈ లీగ్ లో మొత్తం 100 జ‌ట్టులు పాల్గొంటాయ‌ని ఏసీఏ అద్యక్షుడు,ఎం.పి. కేశినేని శివనాథ్ కి బి.బి.ఎల్ ఫౌండ‌ర్ చారుణ్య సాయి వివరించారు. అలాగే ఐపిఎల్ తరహాలో ఈ టోర్నమెంట్ ను డిసెంబర్ నెలలో విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అన్ని సెక్టార్ వాళ్లు ఈ లీగ్ లో పాల్గొంటార‌ని చెప్పారు . ఈ సంద‌ర్బంగా ఏసీఏ అద్యక్షుడు,ఎం.పి. కేశినేని శివనాథ్ బి.బి.ఎల్ నిర్వాహ‌కుల‌ను లీగ్ నిర్వ‌హ‌ణ ఎలా వుంటుంద‌నే వివ‌రాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో బి.బి.ఎల్ కో-ఫౌండ‌ర్స్ భ‌ర‌ణి, చైత‌న్య‌, జ‌శ్వంత్, మ‌నీష్‌, సెక్ర‌ట‌రీ సూర‌జ్, వైస్ సెక్ర‌ట‌రీ రోహిత్, అడ్వైజ‌రీ హెడ్ ర‌విశంక‌ర్ పాల్గొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular