Wednesday, July 3, 2024

మొదటి విడత గొర్రెల పంపిణీలో భారీగా కుంభకోణం

  • అప్పటి ఎండి లకా్ష్మరెడ్డి హయాంలోనే 3,66,450 యూనిట్‌ల పంపిణీ
  • మొదటి, రెండో విడత కలిపి 4,25,088 యూనిట్‌ల పంపిణీ
  • ఒక్కో యూనిట్‌కు రూ.20 నుంచి రూ.25 వేలు వసూలు చేసిన జిల్లా అధికారులు
  • ఉమ్మడి వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మం జిల్లాలో
  • అవినీతి అధికంగా జరిగిందని గుర్తించిన అధికారులు
  • ఇప్పటికే లాంగ్‌లీవ్‌పై వెళ్లిన పలు జిల్లాల అధికారులు

గొర్రెల పంపిణీ కుంభకోణంలో ఉమ్మడి జిల్లాలైన వరంగల్, మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్, ఖమ్మంలో అధికంగా అవినీతి జరిగిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి, వికారాబాద్, ఖమ్మం జిల్లాలకు చెందిన ముగ్గురు జిల్లా పశుసంవర్థక శాఖ అధికారులు భయపడి లాంగ్‌లీవ్‌పై వెళ్లినట్టుగా తెలుస్తోంది. ఇలా ఎవరికీ వారే ఈ గొర్రెల కుంభకోణంలో చిక్కుకొని తమను తాము రక్షించుకోవడానికి ప్రస్తుతం తంటాలు పడుతున్నారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటుడడం విశేషం.

ఈ కుంభకోణంలో భాగంగా అప్పట్లో షీప్ అండ్ గోట్‌లో (ఓఎస్‌డి ల్యాండ్)గా పనిచేసిన ఓ రెవెన్యూ అధికారి కూడా కీలకపాత్ర పోషించినట్టుగా అధికారులు గుర్తించారు. ఈ అధికారి మంత్రి ఓఎస్డీ కళ్యాణ్‌తో వందలసార్లు ఫోన్‌లో మాట్లాడినట్టుగా ఏసిబి గుర్తించింది. ఈ అధికారితో పాటు పలు జిల్లాలో గొర్రెల పంపిణీ కింద పలువురు జిల్లా స్థాయి అధికారులు కూడా ఈ అవినీతి దందా నడిపినట్టు ఈడీ, ఏసిబి గుర్తించింది. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని ఏసిబి అరెస్టు చేయగా మరికొందరిని త్వరలో అరెస్టు చేయనున్నట్టుగా తెలిసింది. ఇక రంగంలోకి దిగిన ఈడీ సైతం జిల్లాల వారీగా గొర్రెల పంపిణీకి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడింది.

మొదటి, రెండో విడత గొర్రెల పంపిణీ ఇలా…
గొర్రెల పంపిణీ మొదటి ఫేజ్1లో అప్పటి షీప్ అండ్ గోట్ ఎండి లకా్ష్మరెడ్డి 3,66,450 యూనిట్‌ల గొర్రెలను పంపిణీ చేయగా ఆయన హయాంలోనే ఎక్కువగా అవినీతి జరిగిందని కాగ్ సైతం గుర్తించింది. ఆయన తరువాత అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, షీప్ అండ్ గోట్ ఎండిగా పనిచేసిన అనితా రాజేంద్ర (ఐఏఎస్) 408 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. వీరిద్దరి తరువాత గొర్రెల పంపిణీలో ఎస్.రామచంద్రయ్య షీప్ అండ్ గోట్ ఎండిగా 26,694 యూనిట్ల గొర్రెలను నాగార్జున సాగర్ (ఉప ఎన్నికల్లో), హుజూరాబాద్ (ఉప ఎన్నికల్లో) పంపిణీ చేశారు. ఇక రెండో విడత గొర్రెల పంపిణీలో భాగంగా మొత్తం 31,536 యూనిట్ల గొర్రెలను (మునుగోడు ఉప ఎన్నిక)తో కలిపి ఎస్.రామచంద్రయ్య షీప్ అండ్ గోట్ ఎండిగా పనిచేసినప్పుడు పంపిణీ జరిగింది. మొత్తం మొదటి, రెండో విడత యూనిట్‌లు కలిపి 4,25,088 యూనిట్‌ల గొర్రెలను పంపిణీ చేశారు.

సంవత్సరం పాటు పనిచేయకుండానే జీతం
మొదటి ఫేజ్1లో అప్పటి షీప్ అండ్ గోట్ ఎండి లకా్ష్మరెడ్డి వి.లకా్ష్మరెడ్డి 2017, 18లో 2,56,164 యూనిట్ గొర్రెలను పంపిణీ చేశారు. 2018,19లో 1,08,895 యూనిట్ గొర్రెలను, 2019,20లో 1,329 యూనిట్‌ల గొర్రెలను, 2020,21లో 62 యూనిట్ గొర్రెలను మొత్తం 3,66,450 యూనిట్‌ల గొర్రెలను ఆయన హయాంలోనే పంపిణీ చేశారు. మొత్తంగా 86.2 శాతం మొదటివిడత ఈయన హయాంలోనే జరిగింది. ప్రస్తుతం ఈయన విదేశాలకు పారిపోయారు. ఈయన రిటైర్‌మెంట్ అనంతరం సుమారుగా రెండు సంవత్సరాల పాటు అప్పటి ప్రభుత్వం ఆయన్ను పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా నియమించింది.

అనంతరం ఆయన్ను దళితబంధు సలహాదారుడిగా నియమించింది. ఈ పోస్టులో ఆయన సంవత్సరం పైచిలుకు వరకు పనిచేశారు. ఆ సమయంలో ఆయన జీతం లక్ష రూపాలయని, ఆయనకు అటెండర్, డ్రైవర్‌తో పాటు వెహికిల్ అలవెన్స్ కింద రూ.34,000లను అప్పటి ప్రభుత్వం సమకూర్చిందని, ఆయన దళితబందు సలహాదారుడినిగా పనిచేసినన్నీ రోజులు ఆయన ఒక్క ఫైలుపై కూడా సంతకం చేయలేదని అధికారిక వర్గాల సమాచారం. గొర్రెల పంపిణీలో అవకతవకలు జరిగాయని బయటపడిన మరుక్షణమే ఆయన విదేశాలకు పారిపోయారని ఆ శాఖ ఉద్యోగులు పేర్కొంటున్నారు.

అతి తక్కువగా 408 యూనిట్ గొర్రెల పంపిణీ
లకా్ష్మరెడ్డి తరువాత అప్పటి పశుసంవర్ధక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, షీప్ అండ్ గోట్ ఎండిగా పనిచేసిన అనితా రాజేంద్ర (ఐఏఎస్) 2020, 21సంవత్సరంలో 408 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. ఆమె తరువాత ఎస్.రామచంద్రయ్య షీప్ అండ్ గోట్ ఎండిగా పనిచేశారు. ఈయన హయాంలో 2020,21 సంవత్సరంలో 1,320 యూనిట్‌ల గొర్రెలను నాగార్జున సాగర్ (ఉప ఎన్నికల్లో), 2021, 22 సంవత్సరంలో 21,738 యూనిట్ల గొర్రెలను హుజూరాబాద్ (ఉప ఎన్నికల్లో) , 2022,23 సంవత్సరంలో 3,636 యూనిట్‌ల గొర్రెలను మొత్తంగా 26,694 యూనిట్‌లను ఆయన పంపిణీ చేశారు. ఇక ఫేజ్ 2లో 2023, 24 సంవత్సరంలో 31,536 యూనిట్‌ల గొర్రెలను (మునుగోడు ఉప ఎన్నికలతో కలిపి) ఆయన హయాంలోనే పంపిణీ చేశారు.

గొర్రెలను పంపిణీ చేసినప్పుడు రూ.1,000 వరకు వసూళ్లు
మొదటివిడత గొర్రెల పంపిణీలో కొందరు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు ఒక్కో యూనిట్‌కు రూ.500ల నుంచి రూ.1000లు వసూలు చేశారు. అనంతరం గొర్రెలు దొరక్కపోవడంతో కాగితాల మీదనే గొర్రెల పంపిణీ అధికారులు చూపించారు. కాగితాల మీదనే గొర్రెలను పంపిణీ చేసినప్పుడు కొందరు జిల్లా పశు సంవర్థక శాఖ అధికారులు ఒక్కో యూనిట్‌కు రూ.20 నుంచి రూ.25 వేల చొప్పున వసూలు చేసినట్టుగా ఏసిబి గుర్తించి

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?
- Advertisment -

Most Popular