Thursday, April 17, 2025

బీఆర్ఎస్​కు బిగ్​ షాక్​

  • బీఆర్ఎస్​కు బిగ్​ షాక్​
  • గులాబీల్లో ‘పట్టభద్రుల’ చిచ్చు
  • రాకేశ్​ రెడ్డిని బరిలో నిలపడంపై ఆగ్రహం
  • కీలక సమావేశానికి ముఖ్య నేతల డుమ్మా

వరంగల్​– నల్గొండ‌‌– ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీఆర్ఎస్​లో చిచ్చు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల ముందు పార్టీలో చేరిన రాకేశ్​రెడ్డికి టికెట్​ ఇవ్వడంపై పార్టీ సీనియర్లు మండిపడుతున్నారు. ఈ టికెట్​కోసం కొంతమంది ప్రయత్నాలు చేస్తే.. వారందరినీ కాదని రాకేశ్​రెడ్డికి ఎందుకు ఇచ్చారంటూ నిలదీస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికపై సన్నాహాక సమావేశాన్ని బుధవారం తెలంగాణ భవన్​లో నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ కీలక నేతలు గైర్హాజరయ్యారు. తాము రామంటూ తెగేసి చెప్పారు. దీంతో పార్టీలో ఆందోళన నెలకొన్నది.

ఫోన్​ చేసినా.. రాలే

ఈ సమావేశానికి మూడు ఉమ్మడి జిల్లాల నుంచి మొత్తం 130 మంది నేతలకు బీఆర్ఎస్​ పార్టీ ఆహ్వానం పంపింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు రావాలని సూచించారు. బుధవారం ఉదయం 10 గంటలకు కూడా తెలంగాణ భవన్​ నుంచి పలువురికి ఫోన్లు చేశారు. అయినప్పటికీ.. చాలా మంది రాలేదు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్​ భాస్కర్​ సహా ఎవరూ హాజరుకాలేదు. దీంతో మాజీ మంత్రి ఎర్రబెల్లికి కేటీఆర్​ ఫోన్​ చేయగా.. ఆయన స్విచ్ఛాప్​ చేశారు. ఆ తర్వాత వినయ్​ భాస్కర్​కు పదేపదే ఫోన్​ చేయడంతో.. సమావేశం ముగుస్తుందనగా వచ్చారు. రాకేశ్​రెడ్డి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్​రెడ్డి అనుచరుగా పేరుండటం, పార్టీలో ముందు నుంచి ఉన్న వారిని కాదని ఆయనకే టికెట్​ ఇవ్వడంతో నేతలు అలిగారు. అంతేకాకుండా ఇప్పటికే ప్రచారం చేస్తున్నా.. రాకేశ్​రెడ్డి వెంట బీఆర్​ఎస్​ నేతలు ఎవరూ ఉండటం లేదు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com