Friday, November 15, 2024

మీ కాళ్లు మొక్కుతా.. సీఎం నితీశ్ చర్యకు అంతా అవాక్కు

రోడ్డు కాంట్రాక్టరు కాళ్లు మొక్కేందుకు యత్నించిన సీఎం

ఈ మధ్య బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యవహార శైళి చర్చనీయాంశమవుతోంది. మొన్నా మధ్య ఓ సందర్బంలో ఐఏఎస్ అధికారి కాళ్లు మొక్కుతానని చెప్పిన సీఎం నితీశ్, తాజాగా ఓ కాంట్రాక్టర్ కాళ్లు మొక్కేందుకు ప్రయత్నించడం సంచలనంగా మారింది. బిహార్‌లో ఓ రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ఓ ప్రైవేటు కంపెనీ కంట్రాక్టరుకు సీఎం నీతీశ్‌ కుమార్‌ విజ్ఞప్తి చేశారు. అందుకోసం అవసరమైతే పాదాలకు నమస్కరం చేస్తానంటూ ముఖ్యమంత్రి ముందుకు వెళ్లడంతో అక్కడున్నవారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

జేపీ గంగా పథ్‌ ప్రాజెక్టులో భాగంగా బీహార్ రాజధాని పట్నాలోని గయా ఘాట్‌ నుంచి కంగన్‌ ఘాట్‌ వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి మూడో దశ పనులను సీఎం నీతీశ్‌ కుమార్‌ ప్రారంభించారు. ప్రాజెక్టు వివరాలు, పురోగతిపై అసంతృప్తి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. సంవత్సరం లోపు పనులు పూర్తిచేయాలని నిర్మాణ సంస్థను ఆదేశించారు. ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని, కావాలంటే మీ పాదాలకు నమస్కరిస్తా, సకాలంలో పనులు పూర్తిచేయండని చెబుతూనే.. ముందుకు వెళ్లి కాంట్రాక్టరు చేతులు పట్టుకునేందుకు ప్రయత్నించారు నితీశ్ కుమార్.

ఒక్కసారిగా షాక్ కు గురైన సదరు రోడ్డు కాంట్రాక్టరు.. అలా చేయకండి సర్ అంటూ కొంచెం వెనక్కి వెళ్లిపోయాడు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ తీరుతో వేదిక వద్ద ఉన్న డిప్యూటీ సీఎంలు సామ్రాట్‌ ఛౌదరీ, విజయ్‌ కుమార్‌ తో పాటు స్థానిక ఎంపీ రవిశంకర్‌ ప్రసాద్‌, ఇతర నాయకులు, ఉన్నతాధికారులు ఒక్కసారిగా లేచి నిలబడి ఆయన్ను నిలువరించే ప్రయత్నం చేశారు. గతంలోను సర్వేలు వేగవంతం చేసి భూ వివాదాలను త్వరగా పరిష్కరించాలని కోరుతూ ఓ ఐఏఎస్‌ అధికారి కాళ్లు మొక్కుతానని సీఎం నితీశ్ కుమార్ చెప్పిన ఘటనను గుర్తు చేసుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular