Wednesday, February 12, 2025

బర్డ్ ‌ఫ్లూపై అప్రమత్తమైన తెలంగాణ సర్కారు

ఎపి సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌ ‌పోస్టులు
కోళ్ల లారీలను నిలిపివేస్తున్న అధికారులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి జిల్లాల్లో బర్డ్‌ఫ్లూ  కలకలం సృష్టిస్తోంది . రెండు జిల్లాల పరిధిలో భారీగా కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సైతం అప్రమత్తమైంది . ఏపీ నుంచి వచ్చే కోళ్ల లారీలను అడ్డుకోవాలని అధికారులను ఆదేశించింది.  తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలో మూడు చెక్‌పోస్టులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సరిహద్దుల్లోనే కోళ్ల వ్యాన్లను నిలిపివేస్తున్నారు. ఇందులో భాగంగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండలం పుల్లూరు టోల్‌ ‌ప్లాజా వద్ద 44వ జాతీయ రహదారిపై అధికారులు చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఏపీ నుంచి వచ్చిన రెండు లారీలను అడ్డుకుని.. తిప్పి పంపించారు. సోమవారం కూడా ఐదు లారీలను వెనక్కి తిప్పి పంపించామని పోలీసు అధికారులు వెల్లడించారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com