Sunday, March 16, 2025

మనిషికి సోకిన బర్డ్‌ ఫ్లూ

బర్డ్‌ ఫ్లూ.. ఎక్కడ చూసిన ప్రస్తుతం అంతటా బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌లో ఉన్నారు. ఇప్పటి వరకు కోళ్లలో మాత్రమే గుర్తించిన బర్డ్ ఫ్లూ వైరస్ ఇప్పుడు మనుషులకు సోకుతోంది జాగ్రత్త. గత కొద్దిరోజులుగా బర్డ్ ఫ్లూ వైరస్ వల్ల ఆంధ్రప్రదేశ్‌లో 10 లక్షలకుపైగా కోళ్లు మృతి చెందాయి. ఈనేపథ్యంలో ప్రభుత్వం, పశుసంవర్ధకశాఖ చికెన్ తినడం కొద్దిరోజులు మానేయాలని సూచించింది. అయినప్పటికి మనిషికి బర్డ్ ఫ్లూ వ్యాధి సోకినట్లుగా తొలి కేసు నమోదైంది. ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలంలోని ఓ కోళ్లఫారమ్ దగ్గర ఉంటున్న వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ రావడంతో అతడికి చికిత్స అందిస్తున్నారు. సమీపంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

చికెన్ తెచ్చిన తంటాలు..
ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రమాదఘంటికలు మోగిస్తోంది. మాయదారి వైరస్ కారణంగా రోజుల వ్యవధిలోనే 10 లక్షల కోళ్లు చనిపోవడం ప్రజల్ని కలవరపెడుతోంది. అందుకే అధికారులు చికెన్ తినవద్దని సూచించారు. కొన్ని జిల్లాల్లో చికెన్ విక్రయాలు నిషేధించారు. అయినప్పటికి ఏపీలో మనిషిలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకడం ఇప్పుడు ఆందోళనన కలిగిస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com