Wednesday, April 30, 2025

బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదు

టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్
బిజెపి, బిఆర్‌ఎస్‌లకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని టిపిసిసి అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న బిజెపి తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అయిన భారతదేశంలో మతాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని నిరుద్యోగులకు హామీ ఇచ్చిన బిజెపి ఉద్యోగాల కల్పనలో విఫలమైందన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా, అన్నిరంగాల్లో తెలంగాణకు అన్యాయం చేసిన బిజెపి నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బండి సుధాకర్ ప్రశ్నించారు.

నిన్నటివరకు అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆ పార్టీలో చేర్చుకుందని, ప్రస్తుతం అదే పని కాంగ్రెస్ చేస్తే తప్పు ఎలా అవుతుందని బండి సుధాకర్ ప్రశ్నించారు. అధికారం పోయేసరికి కెటిఆర్ అసహనంతో మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో రైతులకు ఎలాంటి సమస్యలు లేకున్నా, వీళ్లే కృత్రిమంగా సమస్యలు సృష్టిస్తున్నారని బండి సుధాకర్ గౌడ్ దుయ్యబట్టారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీల అభ్యర్థులను మరోసారి ఓడించి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బండి సుధాకర్ గౌడ్ హెచ్చరించారు.

ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు శ్రీపాద సతీష్, అనిల్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు సమ్మెట రాజు, పంథిని ఉప సర్పంచ్ మహేందర మల్లేశం, ఉప్పునూతుల సమ్మయ్య యువజన నాయకులు గుర్రపు నిఖిల్, మడూరి రాజు, యాట సంపత్, బండి రమేశ్, దంసాని రాము, డాక్టర్ చిర్ర శ్రీనివాస్, చిర్ర రాజు, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com