Tuesday, December 24, 2024

మత్స్యకారులను బిజెపి, బిఆర్‌ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదు

  • మత్స్యకారులను బిజెపి, బిఆర్‌ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదు
  • ఫిషర్‌మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి కుమార్

మత్స్యకారుల కుటుంబాలకు రాహుల్ గాంధీ వరాల జల్లు కురిపించారని, ఫిషర్‌మెన్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పేర్కొన్నారు. తుక్కగూడ సభను విజయవంతం చేసిన ఆయన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల తరువాత ప్రభుత్వం మత్స్యకారులకు బ్యాంకుల ద్వారా క్రెడిట్ కార్డ్ ఇవ్వబోతోందన్నారు. మత్స్యకారులను బిజెపి, బిఆర్‌ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదన్నారు. మత్స్యకారులకు బోట్స్‌తో పాటు సబ్సిడీలో పెట్రోల్, డీజిల్ ఇవ్వబోతుందన్నారు. మత్స్యకారులు ఎవరైనా చనిపోతే మూడు నెల్లోనే జీవిత బీమా వస్తుందని, మత్స్యకారుల కుటుంబాల్లో కాంగ్రెస్ సంతోషం తీసుకురాబోతోందన్నారు. బిజెపి, బిఆర్‌ఎస్‌కు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మత్స్యకారులు బుద్ధి చెప్పాలని, 14 పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com