Saturday, April 5, 2025

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ బరిలో బీజేపీ

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోరు అనూహ్య మలుపు తీసుకుంది. ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు పోటీ నుంచి తప్పుకోవడంతో పాటు పోటీపై బీజేపీ డైలమాలో పడిపోవడంతో ఎంఐఎం అభ్యర్థి ఎన్నిక లాంఛనమే అనుకున్నారు. అయితే బీజేపీ నామినేషన్ల దాఖలు చివరి రోజున అనూహ్యంగా ఈ ఎన్నికల్లో పోటీకి నిర్ణయించుకుని పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత ఎన్. గౌతమ్ రావును ప్రకటించేసింది. ఆయన ఈ రోజు తన నామినేషన్ దాఖలు చేయనున్నారు. బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడిగా గౌతమ్ రావు పనిచేశారు.
బీజేపీ అభ్యర్థి పోటీతో ఇప్పుడు ఈ ఎన్నికలు రసవత్తరంగా మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు తగిన సంఖ్యాబలం లేకపోవడంతో పోటీకి దూరంగా ఉన్నాయి. కాంగ్రెస్ మాత్రం ఎంఐఎంకు మద్ధతు ప్రకటించింది. ఎంఐఎం పార్టీ 49 ఓట్లతో బలంగా ఉండటం.. పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ(14ఓట్లు) మద్దతు ఇస్తుండడంతో ఎంఐఎం పార్టీ విజయం దాదాపు ఖాయంగా కనిపిస్తుంది. నిజానికి బీజేపీ అభ్యర్థి గెలుపుకు అవసరమైన ఓట్ల బలం లేదు. అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి క్రాస్ ఓటింగ్ పై భారీ ఆశలు పెట్టుకుని పోటీలోకి దిగి ఎన్నికలపై ఉత్కంఠకు తెర లేపింది. బీజేపీ పోటీతో ఇప్పుడు క్యాంపు రాజకీయాలకు కూడా తెరలేచినట్లయ్యింది. నామినేషన్ల ఉప సంహరణకు ఏప్రిల్ 9 వరకు అవకాశముంది. ఏప్రిల్ 23న పోలింగ్, 25న ఓట్ల లెక్కింపు ప్రక్రియలను నిర్వహించనున్నారు.
హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో మొత్తం 110మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 81మంది కార్పోరేటర్లు, 29మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటర్లుగా ఉన్నారు. 3 డివిజన్లకు కార్పొరేటర్లు లేరు. ఇందులో ఎంఐఎంకు 49ఓట్లు(1 ఎంపీ, 7 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ, 40 మంది కార్పొరేటర్లు),
, బీఆర్ఎస్ కు 25(3 రాజ్యసభ ఎంపీలు, 2 ఎమ్మె ల్సీలు, 5 ఎమ్మెల్యేలు, 15 మంది కార్పొరేటర్లు), బీజేపీకి 22(1 ఎంపీ, 1 ఎమ్మెల్సీ, 1 ఎమ్మెల్యే, 19 మంది కార్పొరేటర్లు), కాంగ్రెస్ కు 14(1 రాజ్యసభ ఎంపీ, 4 ఎమ్మె ల్సీలు, 2 ఎమ్మెల్యేలు, 7 కార్పొరేటర్లు)ఓట్లు ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎం.ఎస్.ప్రభాకర్ పదవీ కాలం మే 1తో ముగియ్యనుంది.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com