Thursday, December 12, 2024

రావద్దు మాధవీ…!

బీజేపీ నాయకురాలు మాధవీ లతపై కర్ణాటకలో నిషేధం

భారతీయ జనతా పార్టీకి (బీజేపీ) చెందిన మాధవి లతపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. ముఖ్యంగా కర్ణటాకలోని బీదర్ జిల్లాలో ఆమె ప్రవేశించడానికి వీల్లదని బీదర్ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. మాధవీ లత తాజాగా ఒక హిందు సంస్థతో సమావేశంలో పాల్గొనాల్సి ఉండగా.. ఆమెతో పాటా పలువురు ప్రముఖ రాజకీయ నాయకులపై జిల్లా కలెక్టర్ గిరీష్ బడోలె బీదర్ లో ప్రవేశానికి అనుమతులు నిరాకరిస్తూ ఆదేశాలు జారీ చేశారు. మాధవి లత రాకతో జిల్లా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయని కలెక్టర్ కారణాలు తెలిపారు. మాధవీ లతతో పాటు శ్రీ రామ్ సేన చీఫ్ ప్రమోద్ ముథాలిక్, తనను తాను హిందుత్వ కార్యకర్తగా ప్రకటించుకున్న కాజల్ హిందుస్తానీ లకు కూడా బీదర్ లో ప్రవేశానిక కలెక్టర్ గిరీష్ అనుమతులు నిరాకరించారు. వీరంతా గతంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ వ్యాఖ్యలు చేశారని.. ప్రసంగాల ద్వారా సమాజం శాంతి భద్రతల సమస్యలు కలిగించినవారని జారీ చేసిన ఆదేశాల్లో బీదర్ కలెక్టర్ పేర్కొన్నారు.

కేంద్రంలోని బిజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023 సెక్షన్ 163 (పాత సెక్షన్ 144 ఎమర్జెన్సీ) ప్రకారం.. కలెక్టర్లకు శాంతి భద్రతల దృష్ట్యా ఇలాంటి ఆదేశాలు జారీ చేసే అధికారాలున్నాయి. ఈ చట్ట ప్రకారం.. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా ఏ అనుమానిత కార్యక్రమంలో నైనా అయిదుగురు లేదా అంతకంటే ఎక్కువమంది పాల్గొనకూడదు. ఈ నేపథ్యంలోనే పౌరుల భద్రత దృష్ట్యా బీదర్ కలెక్టర్ జిల్లాల్లోని సాయి స్కూల్ గ్రౌండ్స్ లో బిజేపీ, హిందూ సంస్థలు చేపట్టిన ధార్మిక కార్యక్రమంపై నిర్ణీత సమయం వరకు నిషేధం విధించారు. అయితే కలెక్టర్ ఆదేశాల పట్ల కార్యక్రమం చేపట్టిన హిందూ సంస్థలు తీవ్రంగా విమర్శలు చేశాయి.

హిందువుల గొంతుకలు అణవేసేందుకే కర్ణాటక ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిజేపీ నాయకులు ఆరోపణలు చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన మాధవి లత.. సిట్టింగ్ ఎంపీ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీకి ప్రచారంలో గట్టిపోటీనిచ్చారు. ప్రచార సమయంలో ఆమె తీరు వివాదాస్పదమైంది. ఎన్నికల అఫిడవిల్ లో ఆమె తనపై ఒక క్రిమినల్ కేసు విచారణ పెండింగ్ లో ఉన్నట్లు తెలిపింది. అయితే చివరికి ఎన్నికల్లో ఆమె ఓడిపోవడంతో నిరాశ చెందారు. అసదుద్దీన్ ఒవైసీ భారీ మెజారిటీతో విజయం సాధించారు.

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular