Monday, November 18, 2024

సీఎం రేవంత్ కు బీజేపీ నాయకుల మద్దతు

  • అభినవ భగీరథుడు అంటూ ఫ్లెక్సీలు

ఎప్పుడు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డిని పొగుడుతూ బీజేపీ నేతలు ఫ్లెక్సీ కట్టారు. అంతేకాదు..ఆయనకు మద్దతుగా నిలువాలని పిలుపునిచ్చారు. అయితే, ఇందుకు కారణం లేకపోలేదు.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా హైదరాబాద్ లో అక్రమ కట్టడాలను కూల్చివేస్తూ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అక్రమ కట్టడాలు ఎవరివైన సరే కూల్చేస్తామని హైడ్రా తేల్చి చెప్పింది.

హైదరాబాద్ లో ఆక్రమణల నుంచి చెరువులను కాపాడేందుకు తీసుకొచ్చిన ‘హైడ్రా’కు బీజేపీ నాయకులు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్ కన్వెన్షన్ సెంటర్ కూల్చివేతపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సీఎం రేవంత్ రెడ్డి మద్దతుగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఏ పార్టీ అని చూడకుండా అక్రమకట్టడాలను కూల్చివేయాలని తాము అండగా ఉంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా చెప్పారు.

తాజాగా హుస్నాబాద్లో పలువురు బీజేపీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డికి మద్దతుగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ‘హైడ్రాను స్వాగతిద్దాం. అభినవ భగీరథుడు చెరువులను, కుంటలను సంరక్షించే సీఎం రేవంత్ రెడ్డికి అండగా నిలుద్దాం. పార్టీలకు అతీతంగా మద్దతు ఇద్దాం’ అని పిలుపునిస్తూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular