Friday, December 27, 2024

కాంగ్రెస్ ఐదుగురు షిండేలు

  • రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ లో కంఫర్ట్ లేదు
  • సెకండ్ పోజిషన్ నుంచి భట్టిని తప్పించే ప్రయత్నం
  • బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

టీఎస్​, న్యూస్: కాంగ్రెస్ పార్టీలోనే ఐదుగురు షిండేలు ఉన్నారని బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఆ పార్టీలో ఎల్లో కాంగ్రెస్, గ్రీన్ కాంగ్రెస్ , గాంధీ కాంగ్రెస్ అనే మూడు గ్రూపులు ఉన్నాయన్నారు. 25 మందితో తన వర్గం ఎమ్మెల్యేలకు తోడుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తెచ్చుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తుండగా, రేవంత్ కు పోటీగా 25 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని ఆయన అన్నారు. బుధవారం మహేశ్వర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనను సీఎం పదవి నుంచి తప్పించడానికి కుట్ర జరుగుతోందని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి మాట్లాడటం ఆయన అసమర్థతకు నిదర్శనమని మహేశ్వర్ రెడ్డి ఎద్దేవా చేశారు.

పీసీసీ పదవీ వేరని, సీఎం పదవీ వేరని… అయితే సీఎం పదవి కోసం కాంగ్రెస్ లో పదిమంది పోటీ పడుతున్నారని అన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీద కాంగ్రెస్ లో పెద్ద కుట్ర జరుగుతుందని అన్నారు. యాదగిరి గుట్టలో భట్టిని కింద కూర్చోబెట్టారని, ఆయన డ్రైవర్ ను కొట్టారన్నారు. కాంగ్రెస్ లో సెకండ్ పోజిషన్ నుంచి భట్టి విక్రమార్కను తప్పించే ప్రయత్నాలు ఊపందుకున్నాయని అన్నారు. కాంగ్రెస్ సెకండ్ పోజిషన్ కోసం ఆ పార్టీ నేతలు పోటీ పడుతున్న క్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను బీట్యాక్స్ అని కాంగ్రెస్ వాళ్ళే లీకులు ఇచ్చారని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ పార్టీలో కంఫర్ట్ లేక సొంత దుకాణం కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ఇతర పార్టీల నేతలు తమతో టచ్ లో ఉన్నారని, గేట్లు ఎత్తేశామని రేవంత్ రెడ్డి చెబుతున్నప్పటికీ , ఆ పార్టీలో చేరే ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ గేట్లు ఎత్తినా, విండోలు ఓపెన్ చేసినా సరే ఆ పార్టీలోకి ఎవరూ వెళ్ళరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూల్చనవసరం లేదని, వాళ్ళ మధ్య విభేదాలే వాళ్ళను వీక్ చేస్తాయని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఏ పార్టీలోకి వెళ్ళరని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

అల్లు అర్జున్ పట్ల రేవంత్ రెడ్డి దారుణంగా వ్యవహరిస్తున్నారన్న డీకే అరుణ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com