Thursday, February 13, 2025

U Tax: రాష్ట్రంలో కొత్తగా యూ ట్యాక్స్ వసూలు

  • రూ. 500 కోట్లు చేతులు మారాయి
  • ఢిల్లీకి రూ.100 కోట్లను మంత్రి ఉత్తమ్ పంపించారు
  • సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికే ఇదంతా
  • బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో కొత్తగా ”యూ ట్సాక్స్ ” వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు. రూ.500 కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. సివిల్ సప్లై శాఖలో వంద కోట్ల రూపాయలు వసూలు చేసి డిల్లి పంపింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. సీఎం రేసులో ఉన్నానని చెప్పడానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీకి డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేసులో ఎక్కడ వెనుకబడి పోతానేమో అనే భయంతో ఇలా చేశారని అన్నారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మహేశ్వర్ రెడ్డి మాట్లాడారు.. రైస్ మిల్లర్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ రైస్ ఎంత మేరకు ఇచ్చారని ప్రశ్నించారు.

డిఫాల్టర్లుగా ఉన్న రైస్ మిల్లర్లకు మళ్ళీ ఎందుకు ధాన్యం ఇస్తున్నారని నిలదీశారు. రైతుల దగ్గర ధాన్యం దోచుకుంటున్నారని, రైస్ మిల్లర్ల దగ్గర ధాన్యం ఉంటే.. ప్రభుత్వం ఎందుకు వడ్డీ కడుతుందని ప్రశ్నించారు. ప్రభుత్వం వడ్డీ కడుతున్నది నిజం కాదా? అని అడిగారు. తన ప్రశ్నలకు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని రైతులు పండించిన ధాన్యాన్ని స్వేచ్ఛగా అమ్ముకోలేని దుస్థితి నెలకొందని మహేశ్వర్ రెడ్డి ఆేదన వ్యక్తం చేశారు. తేమ పేరుతో క్వింటాల్ కు పది నుంచి 12 కిలోల తరుగు తీస్తున్నారని ఆయన ఆరోపించారు. సివిల్ సప్లై డైరెక్టర్ చౌహాన్ కు వ్యవసాయ శాఖ గురించి తెలియదని, ధాన్యం కొనుగోళ్ళలో 10 నుంచి 12 కిలోల తరుగు ఎవరి జేబులోకి వెళ్లోందని ప్రశ్నించారు. ఒక కోటి ముప్పై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తుంటే.. అందులో పది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం తరుగు పేరుతో తీస్తున్నారని ఆయన మండిపడ్డారు.

నిరాధారమై అసత్య ఆరోపణలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

తనపై బీజేపీ ఎల్పీనేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధార, అసత్యాలు అని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖండించారు. కనీస అవగాహన లేకుండా నిత్యం వార్తల్లో ఉండాలనే తాపత్రయంతో మహేశ్వర్ రెడ్డి , బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. వందరోజుల్లో తెలంగాణలో అద్భుతమైన పాలన అందించామన్నారు. తాము వంద రోజుల పాలనలో అవినీతికి పాల్పడి యూ టాక్స్ వసూలు చేశామని అనడం పచ్చి అబద్ధం, దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com