-
బిజెపి సభ్యత్వ నమోదుని విజయవంతం చేయాలి
-
ఎన్టీఆర్ జిల్లా కన్వీనర్ బోగవల్లి శ్రీధర్
బిజెపి సభ్యత్వ నమోదు లక్ష్యాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని ఎన్టీఆర్ జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ బోగవల్లి శ్రీధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం భవానిపురంలోని ఎన్డీయే కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బోగవల్లి శ్రీధర్ మాట్లాడుతూ సెప్టెంబర్లో క్రియాశీల సభ్యత్వ నమోదు కార్యక్రమం విజయవంతంగా ప్రారంభించామన్నారు. ఇటీవల సంభవించిన వరదల దృష్ట్యా బిజెపి నేతలు అంతా సహాయక చర్యలో ఉండటం వలన సభ్యత్వ నమోదు కొంతమేర నెమ్మదించిందన్నారు.
విపత్తు సమయంలో పశ్చిమ శాసనసభ్యులు సుజనా చౌదరి ఆదేశాల మేరకు అడ్డూరి శ్రీరామ్ నాయకత్వంలో కూటమి నేతలతో కలిసి శరవేగంగా బాధితులకు సహాయ సహకారాలను అందించామన్నారు. గతంలో పశ్చిమ లో 25 వేల సభ్యత్వాలు నమోదు చేయబడ్డాయని రానున్న రోజుల్లో ఆ సంఖ్యను 75 వేల పైచిలుకు సభ్యత్వాలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో దశాబ్ద కాలంగా బ్రహ్మాండమైన అభివృద్ధి, సంక్షేమ, పాలన సాగుతుందని అన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పిలుపుమేరకు మరింత ఉత్సాహంగా పనిచేస్తూ సభ్యత్వ నమోదును విజయవంతం చేస్తామన్నారు. ఓబిసి మోర్చా రాష్ట్ర కోశాధికారి బి ఎస్ కే పట్నాయక్ మాట్లాడుతూ ఈసారి పార్టీ సభ్యత నమోదు అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని అన్నారు.
విపత్తు సమయంలో పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాయకత్వంలో బడుగు బలహీన వర్గాల వారందరికీ అండగా నిలిచామన్నారు. యువతరం బిజెపి సిద్ధాంతాల వైపు మొగ్గు చూపుతుందని 18 నుంచి 25 ఏళ్ల లోపు వారందరూ స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదుకు సిద్ధమవుతున్నారని తెలిపారు. నాయకులు కార్యకర్తలు బిజెపి బలోపేతానికి కృషి చేయాలని ప్రతి గడపగడపకు బిజెపి సభ్యత్వం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి గన్నవరపు శ్రీనివాస్, కోశాధికారి ఆవ్వారు బుల్లబ్బాయి, కార్యదర్శి నున్న కృష్ణ, సెక్రెటరీ వేరుకొండ ఉమాకాంత్, చేనేత కన్వీనర్ సత్య సాయి ప్రసాద్ పైలా సురేష్ తదితరులు పాల్గొన్నారు