Tuesday, December 24, 2024

పుష్ప అంతా ఫేక్… నేనూ ఎర్రచందనం వ్యాపారినే

నేనూ ఎర్రచందనం వ్యాపారినే : బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి

ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దీనివల్ల యువత పెద్ద సంఖ్యలో చెట్లు నరికేశారని.. పుష్ప 2 వల్ల ఇంకెన్నీ నరికేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. ఐకాన్ స్టార్ అల్ల అర్జున్, రష్మిక నటించిన పుష్ప 2 సినిమా థియేటర్లలో సందడి చేస్తోంది.

రిలీజ్‌కు ముందే దాదాపు రూ.వెయ్యి కోట్ల వ్యాపారం చేసి రికార్డు సృష్టించిన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న మొదటి భారతీయ సినిమాగా మరో ఘనత సాధించింది. పుష్ప-2 ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన సినిమా అని అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రంపై తెలంగాణకు చెందిన ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిచేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. సినిమాలో ఎర్రచందనం ధర గురించి చూపించిందంతా అబద్ధమని తెలిపారు.

 

ఉత్తిదే పుష్ప

” ఎర్రచందనం ధర టన్నుకు లక్షల రూపాయలు ఉంటే.. పుష్ప పార్ట్ 1లో కోటీ రూపాయలుగా చూపించారు. దీనివల్ల పెద్ద సంఖ్యలో ఈ చెట్లను యువత నరికేశారు. ఇప్పుడు పుష్ప-2 కి ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ?. యువత సినిమా వల్ల చెడిపోతుంది. అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్‌ను అరెస్టు చేయాలి. సినిమాను నిలిపివేయాలని” ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి అన్నారు. అలాగే తాను కూడా ఎర్రచందనం వ్యాపారినేనని పేర్కొన్నారు. రాకేశ్ రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు పుష్ప-2పై ఏపీకి చెందిన గన్నవరం నియోజకవర్గ జనసేన నేత చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం రేపుతున్నాయి. అల్లు అర్జున్‌ మెగా ఫ్యామిలీకి క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే పుష్ప-2 సినిమాను ఏపీలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఇదిలాఉండగా.. గురువారం పుష్ప-2 నడుస్తున్న థియేటర్లలో సందడి వాతావరణం నెలకొంది. సినిమాను చూసేందుకు అల్లుఅర్జున్‌ ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు క్యూలు కడుతున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com