Sunday, February 9, 2025

కాగజ్‌నగర్‌ను మహారాష్ట్రలో కలపాలా?

బిజెపి ఎమ్మెల్యే వ్యాఖ్యలు దారుణం
క్షేత్రస్థాయిలో స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
కష్టకాలంలో ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌మనతో కలిశారు
కాగజ్‌నగర్‌ ‌కార్యకర్తల భేటీలో బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కెటిఆర్‌

సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ను మహారాష్ట్రలో కలపమని అక్కడి బీజేపీ ఎమ్మెల్యే సోయిలేకుండా మాట్లాడుతున్నాడని బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మండిపడ్డారు. కాగజ్‌ ‌నగర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నాయకులు, కార్యకర్తల మనసులో ఉన్న మాట తనకు అర్థమైందని.. ఇదే విషయాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ ‌పై ఉన్న వ్యతిరేకతను ఉపయోగించుకొని వొచ్చే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తివంచన లేకుండా పనిచేయాలన్నారు.

ప్రతిపక్షంలో ఉన్న మనపార్టీతో కలిసి నడిచేందుకు ముందుకు వొచ్చిన నాయకుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సమాజం గురించి.. తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్‌ ‌తెలంగాణ గురించి ప్రవీణ్‌ ‌కుమార్‌  ఆలోచనలు నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయని తెలిపారు. సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నదని కేటీఆర్‌ ‌తెలిపారు. 2006 నుంచి 2009 వరకు అక్కడ పార్టీ బలోపేతం కోసం పని చేశానని గుర్తుచేశారు. హైదరాబాద్‌ ‌తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన సిర్పూర్‌ ‌కాగజ్‌నగర్‌ ‌బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్‌ ‌పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తల ఆత్మీయ సమావేశం కోసం 400 కిలోటర్లు ప్రయాణం చేసి వచ్చిన పార్టీ కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అధికారం లేకున్నా.. అర్ధ రూపాయి డబ్బులు ఇవ్వకున్నా.. కేసీఆర్‌ ‌ద ప్రేమతో 400 కిలోటర్లు ప్రయాణించి హైదరాబాద్‌ ‌వచ్చిన ప్రతి ఒక్క సోదర సోదరీమణునికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతామని అన్నారు. అందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కూడా అప్పుడప్పుడు మబ్బుల చాటుకు వెళ్లొస్తాడని.. అలాగే కేసీఆర్‌ ‌కూడా ప్రజల ఆశీర్వాదంతో తిరిగి అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌తో తనకు వ్యక్తిగతంగా అనుబంధం ఉన్నదని కేటీఆర్‌ ‌తెలిపారు. 2006 నుంచి 2009 వరకు అక్కడ పార్టీ బలోపేతం కోసం పని చేశానని గుర్తుచేశారు. 2009లో శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా పది సీట్లు మాత్రమే గెలిచినా సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ ‌లో కూడా గులాబీ జెండా ఎగిరిందని అన్నారు. కాగజ్‌ ‌నగర్‌ ‌లో ఉన్న ప్రత్యేకమైన ప్రేమతో అక్కడ ఉన్న ఏకైక పరిశ్రమ కాగజ్‌నగర్‌ ‌పేపర్‌ ‌మిల్లును తెరిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నం చేశానని చెప్పారు.

పేపర్‌ ‌మిల్లును ఓపెన్‌ ‌చేసేందుకు ముంబై, కలకత్తా వంటి అనేక ప్రాంతాల్లో పర్యటించి అనేక కంపెనీలను కలిసి జేకేతో మాట్లాడి పేపర్‌ ‌మిల్లును తిరిగి ఓపెన్‌ ‌చేయించానని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న మన పార్టీతో కలిసి నడిచేందుకు ముందుకు వచ్చిన నాయకుడు ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ అని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ సమాజం గురించి.. తెలంగాణ అభివృద్ధి గురించి భవిష్యత్తు తెలంగాణ గురించి ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌గారి ఆలోచనలు నా ఆలోచనలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయని తెలిపారు.

అధికారంలో ఉన్న రేవంత్‌ ‌రెడ్డి ఇచ్చిన అనేక అవకాశాలను, పదవులను వదులుకొని బహుజన అభివృద్ధి కోసం మన పార్టీలో ఆయన చేరారని పేర్కొన్నారు. కేసీఆర్‌తోనే బహుజనుల అభివృద్ధి జరుగుతుందని ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌నమ్మారని అన్నారు. ఆర్‌ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సిర్పూర్‌ ‌కాగజ్‌ ‌నగర్‌ ‌కార్యకర్తలు పనిచేసి అద్భుతమైన ఫలితాలను సాధించాలని కేటీఆర్‌ ‌పిలుపునిచ్చారు. కాగజ్‌ ‌నగర్‌ ‌లో కమిట్మెంట్‌ ఉన్న నాయకులు చాలామంది ఉన్నారని తెలిపారు. కాగజ్‌ ‌నగర్‌ ‌నియోజకవర్గంలో ఉన్న ఏడు మండలాల్లో గులాబీ జెండా ఎగరాలని ధీమా వ్యక్తం చేశారు.

Previous article

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

Shradha Das Hot Photos

Kritisetty Latest Photos

Kamakshi Bhaskarla Images

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com