Wednesday, January 1, 2025

తెలంగాణ కాంగ్రెస్‌ను కూల్చివేసే కుట్ర నిజ‌మేనా?

* ఔన‌ని అంటున్న‌వారి శాతం.. 70.27 శాతం
* అలా కాదంటూ 29.73 శాతం

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా? అని టీఎస్ న్యూస్‌.టీవీ పెట్టిన పోల్‌పై ప్ర‌జ‌లు స్పందించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావ‌డాన్ని కొంద‌రు కాంగ్రెస్ సీనియ‌ర్లు జీర్ణించుకోవ‌ట్లేదు. ఈ క్ర‌మంలో కేంద్ర బీజేపీ పార్టీ, బీఆర్ఎస్‌లు క‌లిసి.. తెలంగాణ‌లో ప్ర‌భుత్వాన్ని కూల్చివేసే కుట్ర‌ప‌న్నుతున్నారా? అనే టాపిక్‌పై టీఎస్ న్యూస్‌.టీవీ పోల్ నిర్వ‌హిస్తే.. దాదాపు 70.27 శాతం మంది నిజ‌మేనంటూ స్పందించారు. 29.73 శాతం మంది అలాంటిదేం ఉండ‌ద‌ని చెబుతున్నారు. మొత్తానికి, ఈ కుట్ర‌ను చేధించ‌డానికి సీఎం రేవంత్ తీవ్రంగా ప్ర‌య‌త్నించ‌క త‌ప్ప‌దు. తెలంగాణ‌లో త‌మ ప్ర‌భుత్వం వ‌చ్చింద‌ని కాంగ్రెస్ సీనియ‌ర్లు.. ఇగోల‌న్నీ ప‌క్క‌న పెట్టి సంతోషంగా ప‌ని చేయాలి. అలా కాకుండా, సొంత ప్ర‌భుత్వాన్ని కూల్చివేసే ప్ర‌య‌త్నం చేస్తే చ‌రిత్రహీనులుగా మిగిలిపోతారని ప్ర‌జ‌లు అంటున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com