Saturday, April 26, 2025

బీజేపీకి షాక్‌.. ఎంఐఎం గెలుపు

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. మొత్తం పోలైన 88 ఓట్లలో ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు లభించాయి. క్రాస్ ఓటింగ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి తీరని నిరాశే ఎదురైంది. ఏప్రిల్ 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 112 ఓటర్లలో 88 ఓట్లు మాత్రమే పోల్​అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంటలోనే ఫలితాలు తేలిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు తెలుపగా, బీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీలో పాల్గొనకపోవడం గమనార్హం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com