తద్వారా ప్రమాదాలు తగ్గడం, ప్రయాణికుల భద్రతకు ముప్పు లేకుండా ఉంటుంది. అయితే, బ్లాక్ బాక్స్ అమర్చే అంశంపై ప్రస్తుతానికి ప్రణాళికలను రైల్వే అధికారులు సిద్ధం చేస్తున్నారు. త బ్లాక్ బాక్స్ అంటే ఏమిటీ..? విమానాల్లో ఈ బ్లాక్ బాక్స్ ఉంటుంది.. విమాన ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యంగా ఈ బ్లాక్ బాక్స్ గురించే చర్చ జరుగుతుంది. ఈ బ్లాక్ బాక్స్ ద్వారా అసలేం జరిగిందో తెలిసి పోతుంది. అందుకే ఈ విధానాన్ని రైళ్లలో కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, విమానంలో ఉన్న బ్లాక్ బాక్స్ ను అప్‌గ్రేడ్ చేసి రైళ్లలో ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ బ్లాక్ బాక్స్ లోకో పైలట్ల మాటలు, రైలు కార్య కలాపాల వీడియో, ఆడియో రికార్డ్ చేస్తుంది. రైలు గమనాన్ని నిశితంగా పరిశీలిస్తుంది. వేగం, బ్రేక్స్, ఇంజన్ స్థితి సహా కీలక అంశాలను గమనిస్తుంది.
ఈ కారణంగా బ్లాక్ బాక్స్‌లను రైళ్లలో ఏర్పాటు చేస్తే ప్రమాదాలు దాదాపుగా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. సిసి కెమెరాలు కూడా.. బ్లాక్ బాక్స్‌తో పాటు రైళ్లలో సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రైల్ ఇంజన్‌లో 4 డిజిటల్ కెమెరా లను ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాల్లో రెండు కెమెరాలు ట్రైన్ లోకో పైలట్స్ కదలికలను ఫోకస్ చేస్తే మరొకటి ఇంజన్ బయట ట్రాక్‌కు ఎదురుగా ఉండి, ట్రాక్‌ను ఫోకస్ చేస్తుంది. నాలుగో కెమెరాను ఇంజన్ పైభాగంలో ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ కింద నార్త్ ఈస్టర్న్ రైల్వే ఇంజన్‌లలో ఈ బ్లాక్ బాక్స్ ను ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే ఎనిమిది ఇంజన్‌లలో ఈ బ్లాక్ బాక్స్ ఏర్పాటు చేశామని త్వరలోనే మరిన్ని రైల్వే ఇంజన్లకు కూడా ఏర్పాటు చేయనున్నట్టు వారు తెలిపారు.