ఇద్దరు మంత్రులను అరెస్ట్ చేసిన పోలీసులు
Black magic on Maldives President Mohamed Muizzou
చేతబడి లాంటి మూడనమ్మకాలు మన దేశంలోనే కాదు.. విదేశాల్లోను ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. మాల్దీవులు అధ్యక్షుడు మొహమ్మద్ ముయిజ్జుపై బ్లాక్ మ్యాజిక్ (చేతబడి ) చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్టు చేశారు. మాల్దీవుల ప్రభుత్వంలో పర్యావరణ శాఖలో సహాయ మంత్రిగా పనిచేస్తున్న షమ్నాజ్ సలీం, అధ్యక్షుడి కార్యాలయ మంత్రిగా విధులు నిర్వహిస్తున్న ఈమె మాజీ భర్త అయిన ఆదం రమీజ్‌లతో పాటు మరో ఇద్దరిని చేతబడి ఆరోపణలపై పోలీసులు అరెస్టు అంతర్జాతీయ మీడియా కధనాలు వెలువడ్డాయి.ఐతే మంత్రుల అరెస్ట్ కు సంబందించి పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
షమ్నాజ్‌మంత్రి తోపాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్టు చేయగా, ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ రిమాండు విధించారని తెలుస్తోంది. అంతే కాకుండా బుధవారం ఆమెను పర్యావరణశాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఒక రోజు తరువాత రమీజ్‌ను గురువారం మంత్రి పదవి నుంచి తప్పించారు.
గతంలో మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు మాలె సిటీ మేయర్ గా ఉన్నప్పుడు కూడా షమ్నాజ్, రమీజ్ లు ఇద్దరూ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పనిచేశారు. ఈ పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం, అధ్యక్షుడి కార్యాలయం కానీ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడం చర్చనీయాంశమవుతోంది.