Saturday, April 19, 2025

హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్‌ రూ. 20లక్షలు డిమాండ్ !

  • సీఎం మాట కూడా లెక్క చేయలేదు
  • హైడ్రా పేరుతో బ్లాక్‌మెయిల్‌
  • రూ. 20లక్షలు డిమాండ్ !

హైడ్రా పేరు చెప్పుకుని ఎవరైనా బ్లాక్‌మెయిల్‌ చేసి దందాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కొందరు అధికారులు సీఎం మాటలను కూడా లెక్క చేయడం లేదు. తాజాగా హైడ్రా పేరిట బెదిరింపులకు పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. హైడ్రా పేరుతో బిల్డర్ల నుంచి వసూళ్లకు పాల్పడిన డాక్టర్ బండ్ల విప్లవ సిన్హాపై కేసు నమోదైంది. తనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలుసునని.. చాలా దగ్గరంటూ ఫోటోలు చూపించి మరి వసూళ్లకు పాల్పడ్డాడు విప్లవ సిన్హా.

దీంతో బిల్డర్లు వాడల రాజేంద్రనాథ్, మంజునాథ్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోషల్ యాక్టివిస్ట్, సోషల్ వర్కర్ అని బోర్డు పెట్టుకొని కస్టమర్లకు తమ ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ జోలికి రావద్దంటే రూ.20లక్షలు ఇవ్వాలని, లేదంటే న్యూస్ పేపర్లో వ్యతిరేకంగా వార్తలు రాయిస్తానని విప్లవ్ బెదిరింపులకు పాల్పడుతున్నట్టుగా ఫిర్యాదులో తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపైఈ రోజు ఉదయం 10.30 గంటలకు పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com