Sunday, April 6, 2025

‌పాలన చేతకాక బిఆర్‌ఎస్‌ ‌పై నిందలు

కాంగ్రెస్‌ ఎం‌త దిగజారినా బిఆర్‌ఎస్‌ ‌నేతలు ఆవేశపడొద్దు..
•హెచ్‌ ‌సీయూ విద్యార్థుల పోరాట స్ఫూర్తికి  అభినందనలు
•మాజీ సీఎం, బిఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

రాష్ట్ర ప్రభుత్వానికి అటువంటి చిత్తశుద్ది పట్టుదల లోపించడం మూలంగానే, రాష్ట్రంలో విద్యుత్‌, ‌తాగునీరు, వ్యవసాయం తదితర రంగాల్లో మౌలిక వసతుల కల్పన దుర్లభంగా మారుతున్నదని  మాజీ సీఎం, బిఆర్‌ ఎస్‌ అధినేత కెసిఆర్‌  ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  నాడు మనల్ని ఫెయిల్‌ ‌చేయాలని చూసినవారే నేడు మనల్ని బదునాం చేస్తున్నారని కేసీఆర్‌ అన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ ‌పాలనను వైఫల్యం చెందించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే వొక విఫల ప్రయోగంగా నిరూపించే కుయుక్తులను నాటి తెలంగాణ వ్యతిరేక శక్తులు మూకుమ్మడిగా అమలు చేశాయన్నారు.

వాటిని తాను అప్రమత్తతతో తిప్పికొట్టడం ద్వారా తోక ముడుచుకున్న ఈ ప్రతీప శక్తులు, తిరిగి ప్రజలను మోసపూరిత వాగ్దానాలతో ఆశలు రేకిత్తించి అధికారం చేజిక్కించుకున్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన వీరు ప్రజలకు పాలనను అందించడంలో చేతగాక తిరిగి బిఆర్‌ఎస్‌ ‌పాలనను తప్పుపడుతూ మనలను నిందించే కుట్రలకు తెరలేపుతున్నారన్నారని కేసీఆర్‌ ‌వివరించారు. అత్యాశలకు ప్రజలను గురిచేసి వాటిని తీర్చడానికి చేతగాక బిఆర్‌ఎస్‌ ‌ను ఆడిపోసుకుంటున్నారని దుయ్యబట్టారు.
‘‘ వీరు ఇలాగే దిగజారి వ్యవహరిస్తుంటారు. మన పార్టీ నేతలు ఆవేశానికి గురికావద్దు. మనలను ప్రజా సమస్యలనుంచి దృష్టి మళ్లించే కుయుక్తులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారు అని తెలిపారు. తెలంగాణ ప్రజల పట్ల ఏ మాత్రం ప్రేమ లేని వీల్ల స్వార్థపూరిత రాజకీయాలను, అత్యాశతో కూడుకున్న అవినీతి ఆలోచన విధానాలను, క్షేత్ర స్థాయిలో ప్రజలు అర్థం చేసుకుని తిప్పికొడుతున్నారని వివరించారు. తెలంగాణకు బిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఇంటి పార్టీ అని, అదే శ్రీరామ రక్ష అని ప్రజలు అర్థం చేసుకున్నారని అన్నారు.

హెచ్‌ ‌సీ యూ విద్యార్థులకు అభినందనలు
హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీ అంశంపై కేసీఆర్‌ ‌చర్చించారు. తెలంగాణ ఉద్యమ ఫలితంగా ఏర్పాటయిన కేంద్రీయ విశ్వవిద్యాలయంలో కేవలం తెలంగాణ విద్యార్థులే చదువుకోరని, దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థలు ఉన్నత విద్యనభ్యసించడానికి వొస్తుంటారని తెలిపారు. అంతటి విశ్వఖ్యాతి గడించిన హెచ్‌ ‌సీయూ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేసీఆర్‌ ‌తప్పుబట్టారు., ఈ విషయంలో హెచ్‌ ‌సీయూ విదార్థులు ప్రదర్శించిన శాంతియుత పోరాట పద్దతిని కేసీఆర్‌ అభినందించారు. ఈ దిశగా విద్యార్థులకు మద్దతుగా నిలిచిన పార్టీ శ్రేణులను అధినేత అభినందించారు.

తమకు అధికారం చేతిలో వుందని నోటికొచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వున్నట్టు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు, ఇటు సభ్య సమాజం, విద్యార్థిలోకం తిప్పికొడుతుందని, అందుకు హెచ్‌ ‌సీ యూ ఉదంతాన్ని గుణపాఠంగా తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేసీఆర్‌ ‌హితవు పలికారు. ఎంతో జాగ్రత్తగా, తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా, అన్ని రంగాల్లో నిలబెడితే.. దాన్ని నిలుపుకోవడం చేతగాక, ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టను దిగజార్చారని, అది చాలక, హెచ సీ యు భూముల వంటి దుందుడుకు చర్యలతో దేశవ్యాప్తంగా రాష్ట్ర పరువు ప్రతిష్టలను కూడా దిగజార్చేలా వ్యవహరిస్తుండడం శోచనీయమన్నారు.

కుల వృత్తులకు బిఆర్‌ఎస్‌ ‌పాలన స్వర్ణయుగం
తెలంగాణలో కుల వృత్తులకు బిఆర్‌ఎస్‌ ‌స్వర్ణయుగం గా ఉండేదన్నారు. యాదవుల దగ్గరి నుంచి గొర్రెపిల్లను తీసుకోని దావత్‌ ‌చేసుకున్న ప్రజా ప్రతినిధులను చూసినం గతంలో గానీ… యాదవులకే గొర్రె పిల్లనిచ్చి వారి కుల వృత్తిని ఆదుకున్న బడుగు వర్గాల పక్షపాతిగా వున్న ప్రజా ప్రతినిధులు ఈ రాష్ట్రంలో మీరే’ నన్నారు. నాటి రాజుల కాలం నుంచి నేటి ప్రజాస్వామిక ప్రభుత్వాల దాకా… రైతుల దగ్గర భూమి శిస్తు వసూలు చేశారే కానీ, రైతులకు ఉల్టా పంట పెట్టుబడి అందించించిన మొట్టమొదటి ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమేనని కేసీఆర్‌ అన్నారు. ఎమ్మార్వో నుంచి సీసీఎల్యే దాకా ఐదారుగురు యజమానులుండే రైతు భూములను, ప్రభుత్వ ఆజమాయిషీ నుంచి విడిపించి… రైతు భూముల మీద రైతునే సర్వ హక్కుదారునిగా చేసినామన్నారు. ‘ నీ బొటన వేలు పెడితే తప్ప నీ భూమి ఇంకొకరికి మారని విధంగా ధరణి ద్వారా రక్షణ కల్పించా’మని కేసీఆర్‌ ‌గుర్తు చేశారు.వరంగల్‌ ‌లో జరిగే రజతోత్సవ సభకు లక్షలాదిగా ప్రజలు స్వచ్చందంగా తరలి వస్తారని కేసీఆర్‌ ‌విశ్వాసాన్ని ప్రకటించారు. కార్యకర్తలతో పాటు సభకు తరలి వచ్చే ప్రజలకోసం తీసుకోవాల్సిన అన్ని రకాల జాగ్రత్తలను, చర్యలను జిల్లా నేతలకు కేసీఆర్‌ ‌వివరించారు.

రజతోత్సవ సభ అనంతరం… రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించాలని వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కు కేసీఆర్‌ ‌సూచించారు. గ్రామ స్థాయినుంచి పార్టీ కమిటీల నిర్మాణం చేపడతామని తెలిపారు. జిల్లా పార్టీ కార్యాలయాల్లో శిక్షణాతరగతలును నిర్వహించనున్నట్లు అధినేత తెలిపారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులతో పార్టీ సీనియర్లతో రాజకీయ సామాజిక సాంస్కృతిక పాలనాపరమైన రంగాల్లో అవగాహన కార్యక్రమాలు ఉంటాయన్నారు. పలు రాజకీయ సామాజిక అంశాలు అర్థమయ్యే రీతిలో కార్యకర్తలకు అద్భుతమైన శిక్షణనిస్తామన్నారు. ఈ శిక్షణా తరగతుల సందర్భంగా రాష్ట్రం, దేశంలోని రాజకీయ సామాజిక పరిస్థితుల మీద చర్చలు జరుగుతాయన్నారు. కాగా….రజతోత్సవ సభకు బయలుదేరేముందు ప్రతి గ్రామంలో పార్టీ జెండాను ఎగరేసి ఆ తర్వాత ప్రయాణం కావాలని ఇదే విషయం కార్యకర్తలకు తెలియచేయాలని అధినేత సూచించారు. కార్యకర్తలకు సరిపోను జండాలు, కండువాలు, పోస్టర్లు తదితర ప్రచార సామగ్రి పంపిణీ అవుతుందన్నారు. సభకు వచ్చిన ప్రజలకు ఎటువంటి ఆటంకం లేకుండా తాగునీరు, వైద్య సదుపాయాలు, ట్రాఫిక్‌ ‌సదుపాయాలతో సహా అన్ని రకాల చర్యలను చేపట్టేందుకు ఏర్పాట్లు పటిష్టంగా అమలు చేయాలని బిఆర్‌ఎస్‌ ‌పార్టీ అధినేత కేసీఆర్‌ ‌పార్టీ ముఖ్యనేతలకు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com