Tuesday, March 11, 2025

భూమికి ఖాళీగా తిరిగొచ్చిన స్టార్‌లైనర్.. అంతరిక్షంలోనే సునీతా విలియమ్స్‌.

అమెరికా దిగ్గజ విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ చేపట్టిన మొట్టమొదటి అంతరిక్ష మానవసహిత ప్రయోగం అర్ధంతరంగా ముగిసింది. ఇద్దరు వ్యోమగాములను తీసుకుని అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన స్టార్ లైనర్ వ్యోమనౌకకు అంతరిక్షంలో సాంకేతిక సమస్యల కారణంగా వ్యోమగాములను అక్కడే వదిలేసి ఖాళీ క్యాప్సుల్‌ కిందకు వచ్చింది అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి బోయింగ్ స్టార్‌ లైనర్‌ వ్యోమనౌక భూమిపై ల్యాండ్ అయ్యింది.

ఈ ఏడాది జూన్‌లో బోయింగ్‌ క్రూ ఫ్లైట్‌ టెస్ట్‌ లో భాగంగా నాసా ప్రయోగాత్మక పరీక్ష చేపట్టగా.. పది రోజుల మిషన్‌ లో భాగంగా భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్‌ తో పాటు మరో వ్యోమగామి బుచ్‌ విల్‌మోర్‌ ఈ స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో జూన్‌ 5న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కు చేరుకున్నారు. మిషన్ లో భాగంగా జూన్ 14న వీరిద్దరూ భూమికి తిరుగు పయనం కావాల్సి ఉంది. కానీ బోయింగ్ స్టార్‌ లైనర్‌ వ్యోమనౌకలోని థ్రస్టర్లలో సాంకేతిక సమస్య తలెత్తటంతో పాటు హీలియం లీకేజీ కారణంగా వారి ప్రయాణం వాయిదా పడుతూ వచ్చింది.

పలుమార్లు నాసా మరియు బోయింగ్ నిపుణులు స్టార్ లైనర్ లోని సాంకేతిక సమస్యలు సరిచేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఒక దశలో స్టార్ లైనర్ లోని సాంకేతిక సమస్యను పరిష్కరించిన బోయింగ్‌.. వ్యోమగాములను స్టార్‌లైనర్‌ ద్వా భూమికి సురక్షితంగా తీసుకురావచ్చని తెలిపింది. ఐతే నాసా మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో స్టార్‌ లైనర్‌ వ్యామో నౌక ఖాళీగా భూమికి తిరుగు పయనమైంది. అంతరిక్ష కేంద్రం నుంచి బయల్దేరిన ఆరు గంటల తర్వాత అమెరికాలోని న్యూ మెక్సికోలోని వైట్‌ శాండ్స్‌ స్పేస్‌ హార్బర్‌ లో ఈ క్యాప్సుల్‌ సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.

అంతరిక్షంలో ఉండిపోయిన సునీతా విలియమ్స్‌, బుచ్‌ విల్‌మోర్‌ వ్యోమగాములు కోసం ఎలాన్ మస్క్ కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ వ్యోమనౌకను సిద్ధం చేస్తోంది నాసా. దీంతో మరికొంత కాలం పాటు సునీతా, విల్‌మోర్‌ అంతరిక్ష కేంద్రంలోనే ఉండనున్నారు. స్పేస్ ఎక్స్‌ క్రూ-9 మిషన్‌లో భాగంగా మరో ఇద్దరు వ్యోమగాములతో క్రూ డ్రాగన్‌ను నాసా అంతర్జాతీయ అంతరిక్ష కంద్రానికి పంపించే అవకాశాలున్నాయి. ఈ నేల చివరలో లేదంటే అక్టోబర్ రెండవ వారంలో ఈ ప్రయోగం ఉండనుండగా.. ఈ వ్యోమనౌకతో వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో సునీత విలియమ్స్, విల్‌మోర్‌ను భూమ్మీదకు తీసుకువచ్చేందుకు నాసా ప్రణాళికలు సిద్దం చేస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com