Sunday, April 20, 2025

తెలుగు కేంద్రమంత్రులకు శాఖలు కేటాయింపు

కిషన్ రెడ్డికి బోగ్గు గనులు, బండి సంజయ్ కు హోంశాఖ సహాయమంత్రి

కేంద్రమంత్రి పదవులను మోడీ సర్కార్ ఖరారు చేసింది. తెలంగాణ నుంచి కిషన్ రెడ్డికి బొగ్గు, గనుల శాఖ, బండి సంజయ్ కుమార్ కు హోంశాఖ సహాయమంత్రి బాధ్యతలు అప్పగించారు. శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మెహన్ నాయుడుకు పౌరవిమానయాన శాఖను కేటాయించారు. శ్రీనివాస వర్మకు భారీ పరిశ్రమలు, స్టీల్ శాఖల సహాయమంత్రిగా, పెమ్మసాని చంద్రశేఖర్ కి గ్రామీణ అభివృద్ధి శాఖ, కమ్యూనికేషన్ సహాయమంత్రిగా బాధ్యతలు అప్పగించారు.

తెలంగాణకు సంబంధించి కరీంనగర్ ఎంపీలకే రెండు పర్యాయాలు హోంశాఖ సహాయ మంత్రిత్వశాఖే దక్కింది. ఇక 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. అపట్లో కరీంనగర్ ఎంపీగా పనిచేసి సిహెచ్ విద్యాసాగర్ రావు కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. తాజాగా బండి సంజయ్ కుమార్ కు కూడా ఇదే శాఖ దక్కడం గమనార్హం. ఇక ఏపీకి సంబంధించి 2014లో ఎన్డీఏలో భాగస్వామైన టీడీపీకి కూడా పౌరవిమానయాన శాఖ దక్కింది. తాజాగా అదే శాఖను శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడుకి కేటాయించడం విశేషం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com