ఢిల్లీ లోని ఎయిమ్స్, అపోలో, ఫోర్టిస్, సర్ గంగారాం సహా పలు ప్రముఖ ఆసుపత్రులకు
బాంబు బెదిరింపులు వచ్చాయి.. ఈ బెదిరింపు ఈ మెయిల్స్ తో పోలీసులు అప్రమత్తమయ్యారు. మధ్యాహ్నం 12:04 గంటలకు ఆస్పత్రులను పేల్చేస్తామని ఈ-మెయిల్ వచ్చింది.
ఈ బెదిరింపులతో ఢిల్లీ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆస్పత్రులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కానీ, ఎలాంటి బాంబు లభ్యం కాలేదని పోలీసులు తెలిపారు..