Thursday, November 28, 2024

అన్నా.. తమ్ముడు ముహూర్తం కుదురుతుందా…?

సినీ ఇండస్ట్రీలో సినీ తారలు, నిర్మాతలు, దర్శకుల వివాహ జీవితాలు ఒకింత ఆశ్చర్యకరంగానే ఉంటాయి. ఎవరో ఒకరు ఇద్దరు స్టార్స్ మినహా మిగతా చాలా మంది సినీ నటీనటుల జీవితాల్లో పెళ్లిళ్లు, ఇతర రిలేషన్ షిప్స్ అంటూ చాలా వ్యవహారాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ప్రేమించి పెళ్లి చేసుకొని, విడిపోయిన జంటలు కూడా మన తెలుగు చిత్ర పరిశ్రమలో లేకపోలేరు. ఇప్పుడు టాలీవుడ్ లో వినిపిస్తున్న పలు క్రేజీ న్యూస్‌లలో అక్కినేని వారి ఇంటి వ్యవహారం కూడా ఒక్కటి. ఎన్నో విపత్కర పరిస్ధితుల మధ్య యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తన రెండో పెళ్లికి సిద్ధం అయ్యాడు. ఓ పక్క తన పెళ్లి సహా తన మాజీ భార్య సమంతలు కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ నాగ చైతన్య అండ్ అక్కినేని ఫ్యామిలీ మాత్రం తమ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. నాగార్జున కూడా ఈ పెళ్లి పనులు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అని, ఫారిన్‌లో పెళ్లి అని ఏవేవో గాసిప్స్ వైరల్ అవుతుండగా హైదరాబాద్ లోనే అక్కినేని నాగచైతన్య రెండో పెళ్లి జరగనుంది. టాలెంటెడ్ నటి శోభిత ధూళిపాళని చైతూ పెళ్లి చేసుకోనున్న ఈ తరుణంలో అక్కినేని ఫ్యామిలీలో మరో బిగ్‌ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఓ పక్క అన్న నాగ చైతన్య పెళ్లి పనుల్లో బిజీగా ఉంటే ఇంకో పక్క తమ్ముడు అఖిల్ అక్కినేని కూడా తన పెళ్లి పనుల్లో పడ్డాడు. ఇది మాత్రం ఊహించని ట్విస్టే అని చెప్పాలి. గతంలోనే నాగ చైతన్య అలాగే అఖిల్ అక్కినేని పెళ్లి విషయంలో ఒక పక్క చైతు పెళ్లి, ఇంకో పక్క అఖిల్‌కి అప్పుడు కింగ్ నాగ్ ఫ్యామిలీ ఎంగేజ్మెంట్ చేశారు. ఆ వార్తలు అప్పట్లో మంచి వైరల్ గా కూడా మారాయి. కానీ ఇపుడు షాకింగ్ గా మళ్ళీ నాగ చైతన్య పెళ్లి పనుల్లో ఉన్నపుడే అఖిల్ అక్కినేని కూడా సైలెంట్ గా తన ఎంగేజ్మెంట్ ని ముగించుకున్నాడు.
అభిమానులు కానీ, చిత్ర పరిశ్రమకు కానీ ఇది ఊహించని ట్విస్ట్ గా మారింది అని చెప్పాలి. అఖిల్ ఆల్రెడీ ఎంగేజ్మెంట్ సైలెంట్ గా చేసుకున్నారు. దీంతో అసలు ఆ అమ్మాయి ఎవరు ఏంటి ? అనేదానిపై నెటిజన్లు సెర్చ్ చేస్తున్న సమయంలోనే అఖిల్ తండ్రి, టాలీవుడ్ అగ్ర కథా నాయకుడు నాగార్జున స్వయంగా రివీల్ చేసారు. దీనితో ఓ పక్క అన్నయ్యతో పాటుగా మళ్ళీ తమ్ముడు పెళ్ళికి సంబంధించిన వార్తలు రావడం అనేది అక్కినేని ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్ అయినప్పటికీ.. చాలా సందర్భాల్లో ఇది ఒక చర్చే. అఖిల్, జైనబ్ రావ్డ్జీ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టుగా నాగార్జున అధికారికంగా ప్రకటించారు. నాగ చైతన్య పెళ్లి పనుల్లోనే ఈ వార్తని కూడా షేర్ చేయడం టాలీవుడ్​తో పాటుగా రాష్ట్రంలో పలువురు ఒకింత ఆశ్చర్యానికే గురయ్యారు.

ముహూర్తం కుదురుతుందా..?
మొత్తానికి.. అక్కినేని కుటుంబంలో ఒకేసారి రెండు జంటలకు పెండ్లి వేదిక సిద్ధమవుతున్నది. గతంలో కూడా నాగ చైతన్య, సమంత వివాహం జరుగుతుండగానే.. అఖిల్​ పెండ్లి కూడా ఫిక్స్​ అయింది. ఇప్పుడు అఖిల్, చైతన్య.. అప్పుడు ఇప్పుడు ఒకేలా అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం జరుగుతుంది. ఈ పెళ్లి వేడుకకి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను పిలిచే పనిలో అక్కనేని కుటుంబం బిజీగా మారింది. ఓ వైపు అక్కినేని ఫ్యామిలీ అంతా ఈ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఇంతలో అక్కినేని నాగార్జున సడెన్ గా అఖిల్ ఎంగేజ్మెంట్ అయినట్లు ప్రకటించాడు. జైనాబ్ రావ్‌జీ తో అఖిల్ నిశ్చితార్ధం అయ్యిందని ధృవీకరించారు. వారిద్దరి ఫోటోలని కూడా రిలీజ్ చేశారు. గత కొంతకాలంగా అఖిల్ జైనాబ్ తో రిలేషన్ లో ఉన్నట్లు టాక్ తెరపైకి వచ్చింది. అందుకే సడెన్ గా ఎంగేజ్మెంట్ కన్ఫర్మ్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో అనుకుంటున్నారు.
అయితే, గతంలో ఇలాగే చైతన్య, అఖిల్ కి జరిగింది. చైతన్య సమంత ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి పీటలు ఎక్కబోతున్న సమయంలో అఖిల్, శ్రియా భూపాల్ ఎంగేజ్మెంట్ చేశారు. ఆ ఫోటోలని కూడా రిలీజ్ చేశారు. తరువాత ఏవో కారణాల వలన అఖిల్, శ్రియా భూపాల్ పెళ్లి క్యాన్సిల్ అయ్యింది. సమంత, చైతన్య వివాహం జరిగింది. కానీ వీరి వైవాహిక జీవితం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇప్పుడు మరోసారి చైతన్య, శోభిత దూళిపాళ్ల పెళ్లికి మరో 10 రోజులే ఉందనగా అఖిల్ ఎంగేజ్మెంట్ జరిగినట్లు ఎనౌన్స్ చేశారు. అఖిల్ చేసుకోబోయే జైనాబ్ తండ్రి, నాగార్జున వ్యాపార భాగస్వాములు అని తెలుస్తోంది. రెండు కుటుంబాల మధ్య బంధుత్వం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జైనాబ్ తో అఖిల్ ప్రేమలో పడటం, రెండు కుటుంబాలకి ఒకే అనుకోని ఎంగేజ్మెంట్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. వచ్చే ఏడాది అఖిల్, జైనాబ్ వివాహం జరగబోతోందని సమాచారం. ఇదిలా ఉంటే అఖిల్ కంటే జైనాబ్ 9 ఏళ్ళు పెద్ద అని ఓ టాక్ తెరపైకి వచ్చింది. సచిన్ తరహాలోనే తనకంటూ వయస్సులో పెద్ద అయిన అమ్మాయిని అఖిల్ పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ కథనాలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీ పనుల్లో బిజీగా ఉన్నారు. మరో వైపు అఖిల్ కూడా సొంత ప్రొడక్షన్ లో మురళీ కిషోర్ దర్శకత్వంలో ఒక ప్రేమకథా చిత్రంకి ఒకే చెప్పాడు.

ఒకరి తర్వాత ఒకరు
నాగ చైతన్య పెళ్లిపనుల్లో అక్కినేని ఫ్యామిలీ తలమునకలై ఉంటుంది అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. నాగార్జున తన చిన్న కొడుకు అఖిల్ నిశ్సితార్ధాన్ని చేసి షాకిచ్చారు. గతంలోని అఖిల్ నిశ్చితార్ధం జరగగానే నాగ చైతన్య-సమంత ల పెళ్లి జరిగింది. అప్పుడా ఎంగేజ్మెంట్, ఆ పెళ్లి రెండు బ్రేక్ అయ్యాయి. ఇప్పుడు కూడా అఖిల్ నిశ్సితార్ధం అవ్వగానే నాగ చైతన్య శోభిత మెడలో మూడు ముళ్ళు వెయ్యబోతున్నాడు. అయితే నిన్న మంగళవారం అఖిల్ నిశ్సితార్ధం జరిగినట్టుగా సింపుల్ గా ప్రకటించారు. పెళ్లి మాత్రం వచ్చే ఏడాది మార్చి లో ఉంటుంది అని తెలుస్తోంది. నాగ చైతన్య పెళ్లి డిసెంబర్ 4 న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగబోతోంది. చైతు-శోభితల పెళ్లి హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకున్నట్టుగా తెలుస్తుంది. డిసెంబర్ లో పెద్ద కొడుకు చైతూ పెళ్లి చేసే నాగార్జున వచ్చే ఏడాది మార్చి లో చిన్న కొడుకు అఖిల్ వివాహం చేయనున్నట్లుగా తెలుస్తోంది. అఖిల్ – జైనాబ్ రావ్‌జీ పెళ్లిని దుబాయ్ వేదికగా ఇరు ఫ్యామిలీస్ జరిపించనున్నట్లుగా తెలుస్తుంది.

అఖిల్​కు కలిసి వచ్చేనా..?
అక్కినేని అఖిల్​కు కొంత ముహూర్తం కలిసి రావడం లేదు అనేది ఇండస్ట్రీలో ముందు నుంచీ ఉన్న టాక్​. ఇటు సినిమాల్లోనూ ఆయన అంతే. చివరకు శ్రేయా భూపాల్​తో పెండ్లీ పీటల వరకు వచ్చి క్యాన్సిల్​ అయింది. భూపాల్​ కుటుంబమే ఈ పెండ్లిని రద్దు చేసుకున్నట్లు గతంలో చర్చ కూడా జరిగింది. తాజాగా అఖిల్​ చేసుకుంటున్న జైనబ్​.. జుల్ఫీ రవ్జీ కుమార్తె అయిన జైనబ్ రవ్జీ కూడా ఓ ఆర్టిస్టే. దిల్లీకి చెందిన జైనబ్‌ థియేటర్‌ ఆర్టిస్ట్‌గానే కాకుండా సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది. అఖిల్‌, -జైనబ్ మధ్య రెండేళ్ల క్రితం ఏర్పడిన పరిచయం రిలేషన్‌షిప్‌గా మారింది. ఇక వీరి నిశ్చితార్థ వేడుక అక్కినేని ఇంట్లోనే జరిగింది. కేవలం ఫ్యామిలీ సమక్షంలోనే ఈ వేడుకను జరిపించారు. ఇంకా పెళ్లి తేదీ ఖరారు చేయలేదు. గతంలో లాగే.. ఇప్పుడు కూడా జైనబ్‌తో అఖిల్ నిశ్చితార్థం జరగడం పట్ల నాగార్జున చాలా ఆనందంగా ఉన్నారు. జైనబ్ చాలా మంచి అమ్మాయి అని, అఖిల్‌ని చాలా బాగా అర్థం చేసుకుంటుందని.. అలాంటి అమ్మాయి కోడలిగా తమ ఇంటికి రాబోతున్నందకు ఆనందంగా ఉందంటూ నాగార్జున చెప్పారు. ప్రస్తుతం అఖిల్-జైనబ్ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అఖిల్ కూడా తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేశాడు. జైనబ్‌తో హ్యాపీగా ఎంగేజ్‌మెంట్ జరిగింది.. ఫౌండ్ మై ఫరెవర్ అంటూ పోస్ట్ చేశాడు అఖిల్.

భారీ ప్రాజెక్టు‌తో
ఇక కెరీర్ విషయానికొస్తే అఖిల్ అక్కినేనికి ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ విజయం అయితే దక్కలేదు. లవ్, రొమాంటిక్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లలోనూ అఖిల్ సినిమాలు చేశాడు. కానీ ఏ ఒక్కటీ అఖిల్‌కి కలిసిరాలేదు. ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రం మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక భారీ ఆశలతో పాటు భారీ బడ్జెట్‌తో తీసిన ఏజెంట్ కూడా అఖిల్‌కి గట్టిగా దెబ్బేసింది. గతేడాది రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర భారీగా ఫెయిల్ అయింది. దీంతో కొన్నాళ్ల పాటు గ్యాప్ ఇచ్చిన అఖిల్.. ప్రస్తుతం మరో భారీ ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసమే పొడవాటి జుట్టు, గడ్డంతో కొత్త లుక్‌లో ఇన్నాళ్లూ కనిపించాడు. కొత్త డైరెక్టర్‌తో ఈ సినిమాను చేస్తున్నాడు అఖిల్. ఎట్టిపరిస్థితుల్లోనూ హిట్టు కొట్టిన తర్వాతే ఫ్యాన్స్‌ని కలుస్తానంటూ అఖిల్ ఇటీవల ఓ శపథం కూడా చేసినట్లు నాగార్జున చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular