Sunday, April 20, 2025

తెలంగాణ అసెంబ్లీలో ఆ పెన్ను గురించే చర్చ

  • తెలంగాణ అసెంబ్లీలో ఆ పెన్ను గురించే చర్చ
  • షబ్బీర్ ఆలి చెప్పిన ఆసక్తికరమైన విషయాలు

మౌంట్ బ్లాక్.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెన్నుల కంపెనీ. మౌంట్ బ్లాంక్ చాలా అరుదుగా సిరీస్ పెన్నులను తయారు చేస్తూ వస్తోంది. అది కూడా ప్రతి సిరీస్ పెన్నులను పరిమితి మేరకు మాత్రమే తయారు చేస్తోంది మౌంట్ బ్లాంక్. మరీ ముఖ్యంగా ప్రతి నాలుగైదేళ్లకు ఒక స్పెషల్ ఎడిషన్ పెన్నులు రిలీజ్ చేస్తుందీ సంస్థ. ఎవరో ఒక అసాధారణ, ప్రసిద్ధిగాంచిన వ్యక్తుల పేరుతో ఈ పెన్నులను తయారుచేస్తోంది మౌంట్ బ్లాంక్. గతంలో మహాత్మా గాంధీ పేరుతో లిమిటెడ్ ఎడిషన్ పెన్నులను విడుదల చేసింది.

ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం గాంధీ ఎడిషన్ మౌంట్ బ్లాక్ పెన్నునే వాడుతున్నారు. అలాంటి ప్రామఖ్యత గల మౌంట్ బ్లాంక్ పెన్ను హఠాత్తుగా తెలంగాణ అసెంబ్లీలో కనిపించే సరికి అంతా ఆశ్చర్యపోయారు. అవును మాజీ మంత్రి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు మహమ్మద్ షబ్బీర్ ఆలీ జేబులో మౌంట్ బ్లాంక్ పెన్ను ప్రధాన ఆకర్షణగా నిలించింది. పైగా ఆ పెన్నుపై అలి అని బ్రాండ్ ఉండటం మరో ఆసక్తికరమైన విషయం. ఇందుకు సంబందించి షబ్బీర్ ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పారు. షబ్బీర్ అలీ జేబులో ఉంది ప్రముఖ బాక్సర్ అలీ పేరుతో తయారుచేసిన మౌంట్ బ్లాంక్ సంస్థ పెన్.

ఆ పెన్నుపై అలీ అని గోల్డ్ కలర్ అక్షరాలు చెక్కి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ప్రముఖ బాక్సర్ అలీ పేరుతో కేవలం 900 పెన్నులను మాత్రమే తయారుచేసింది మౌంట్ బ్లాంక్. ఐతే షబ్బీర్ అలీ పేరులో కూడా అలీ ఉండడంతో ఒక అభిమాని ఆయనకి ఈ పెన్నును బహుమతిగా ఇచ్చారని షబ్బీర్ ఆలి చెప్పారు. ఈ పెన్ను ఖరీదు సుమారు లక్ష రూపాయలకు పైగానే ఉంటుందని ఆయన చెప్పారు. అదే మహాత్మా గాంధీ పేరుతో ఉన్న లిమిటెడ్ ఎడిషన్ పెన్నుల ఖరీదైతే ఐదు లక్షలకు పైగానే ఉంటుందని షబ్బీర్ ఆలి తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com