Wednesday, January 22, 2025

‘అఖండ 2’ కోసం అలాంటి లొకేషన్‌లో బోయపాటి

బాలకృష్ణ, బోయపాటి శ్రీనులది మోస్ట్ సక్సెస్ ఫుల్ ‘హీరో – డైరెక్టర్’గా కాంబినేషన్. వీరిద్దరి కలయికలో వచ్చిన ‘సింహా’, ‘లెజెండ్’, ‘అఖండ’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. బాలయ్యలోకి మాస్ ను సరికొత్తగా ఆవిష్కరించాయి. అందుకే ఈ కాంబోలో రాబోయే “అఖండ 2″ సినిమాపై అభిమానుల్లో, ఇండస్ట్రీలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇది కచ్చితంగా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ”అఖండ 2: తాండవం” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ టీజర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆధ్యాత్మికత అంశాలకు అధిక ప్రాధాన్యతనిస్తూ.. దేవుళ్ళు, దేవాలయాలు, సనాతన ధర్మం, శివ తత్త్వం ఇతివృత్తాలపై దృష్టి సారిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. డివైన్ ఇంపార్టెన్స్ ని టైటిల్ లోగోతోనే మేకర్స్ తెలియజెప్పారు. బాలయ్యను ఒక అఘోరాగా, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ క్యారక్టర్ లో మొదటి భాగానికి మించి అత్యంత శక్తివంతంగా ప్రజెంట్ చేయబోతున్నారట.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లో జరిగిన మహా కుంభమేళాలో ‘అఖండ 2’ షూటింగ్ చేసిన విషయం తెలిసిందే. కోట్లాది మంది భక్తులు హాజరైన ఆధ్యాత్మిక వేడుకలో.. బోయపాటి కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారని తెలుస్తోంది. ఇక సీనియర్ నటి శోభన ఈ సినిమాలో అఘోరిగా కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్న శోభన.. స్క్రిప్ట్ విన్న వెంటనే ఈ మూవీ చేయడానికి అంగీకరించిందట. ఇక ఇదిలా ఉంటే ఈ అఖండ2 కోసం బోయపాటి ప్రస్తుతం లొకేషన్స్‌ అన్నీ వెతికేస్తున్నారు. దీనికోసం చాలా కసరత్తే చేస్తున్నారు ఆయన. మరి ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామం కృష్ణానది పరివాహక ప్రాంతంలో డైరెక్టర్ బోయపాటి శ్రీను పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు కొంత మంది టీమ్‌ని తీసుకుని వెళ్ళి అక్కడ షూటింగ్‌ ఏ విధంగా చేయాలి ఏ సన్నివేశాలు చేయాలి అని ఆయన ప్లాన్‌ చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com