Tuesday, April 22, 2025

బ్రహ్మానందంపై నిర్మాత ఎస్ కేఎన్ స్పీచ్ కు ప్రశంసలు

అత్యధిక చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ లో స్థానం సంపాదించుకున్న హాస్య బ్రహ్మ బ్రహ్మానందం చిరకాలం మనల్ని నవ్విస్తూనే ఉండాలని అన్నారు ప్రముఖ నిర్మాత ఎస్ కేఎన్. మహా కుంభమేళాలో 150 ఏళ్ల వయసున్న సాధువులను చూశామని, బ్రహ్మానందం కూడా అలా తరతరాలు నవ్వులు పంచాలని ఎస్ కేఎన్ కోరారు. సప్తగిరి లీడ్ రోల్ చేసిన పెళ్లికాని ప్రసాద్ సినిమా ఈవెంట్ లో అతిథిగా పాల్గొన్నారు ఎస్ కేఎన్. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం గురించి నిర్మాత ఎస్ కేఎన్ ఇచ్చిన స్పీచ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఒక దిగ్గజ హాస్య నటుడిని గౌరవిస్తూ ఎస్ కేఎన్ మాట్లాడిన మాటలు ప్రేక్షకులను కదిలిస్తున్నాయి. ఎస్ కేఎన్ స్పీచ్ ను పలువురు ప్రశంసిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకు బ్యాక్ బోన్ గా నిలిచారని చెప్పారు ఎస్ కేఎన్. బ్రహ్మానందం వీడియో చూడనిదే మాకు రోజు గడవదని, ఆయన తన కామెడీతో మనకు స్ట్రెస్ బస్టర్ అయ్యారని ఎస్ కేఎన్ అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com